ఎంత అందంగా ఉందో..అంతే ప్రమాదకరం.. వైరల్ వీడియో

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక అందమైన రోజా పువ్వుపై..నీలం రంగు పాము చూడముచ్చటగా ఉంది. ఎంతో అందంగా ఉన్న ఈ పాము నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. అయితే చూడటానికి ఎంతో అందంగా ఉన్నాఈ పాము..అత్యంత విషపూరితమైనది. ఈ పాము పేరు ‘బ్లూ పిట్ వైపర్’..

ఈ ప్రమాకరమైన పాము కరిస్తే తీవ్రమైన నొప్పి, రక్తస్రావం అవుతుంది. మాస్కో జంతు ప్రదర్శకుల ప్రకారం.. ఈ పిట్ వైపర్ జాతి పాములు ఇండోనేషియా, తూర్పు తైమూర్ లో కనిపిస్తాయి. సాధారణంగా ఇవి తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. నీలం రంగులో ఉండే పాములు చాలా అరుదుగా ఉంటాయి. ప్రస్తుతం ఈ పాముకు చెందిన వీడియో వైరల్ అవుతోంది..

 

Leave a Comment