మళ్లీ వస్తున్నా..దీవించండి : రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మాజీ భార్య రేణు దేశాయ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె రీఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. తన రీఎంట్రీపై రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. త్వరలో కెమెరాముందు వస్తున్నానని వెల్లడించారు. ‘చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకొస్తున్నా. బ్యూటిఫుల్ వెబ్ సిరీస్ లో నటించేందుకు సంతకం చేశాను. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభమవుతుంది. 

త్వరలో దీనికి సంబంధించిన వివరాలు చెబుతాను. సత్యం కోసం అన్వేషిస్తున్న ఓ మహిళ ప్రయాణానికి మీ బ్లెస్సింగ్స్, ప్రేమను అందించాలని కోరుతున్నా’ అంటూ రేణు దేశాయ్ ఇన్ స్టాలో పోస్టు పెట్టారు. ఈ వెబ్ సిరీస్ కు క్రిష్ణమామిడాల దర్శకత్వం వహిస్తున్నారన్నారు. డీఎస్.రావు, ఎస్.రజనీకాంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

 

Leave a Comment