మీ బైక్ ఇంటి బయట పెడుతున్నారా? అయితే జాగ్రత్త..

మీరు బైక్ ఇంటి బయట పెడుతున్నారా? ఉదయం లేచే సరికి మీ బైక్ లో పెట్రోల్ ఉండటం లేదా?  అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే.. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంటి బయట పార్క్ చేసిన బైకుల నుంచి పెట్రోల్ దొంగలించి పారిపోతున్నారు. 

తాజాగా హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ లో ఓ దొంగ తెల్లవారుజామున క్యాన్లు పట్టుకుని బైక్ లోని పెట్రోల్ దొంగలించేందుకు వచ్చాడు. కొద్ది సేపు ఒక ప్రాంతంలో నిల్చున్నాడు. ఆ ప్రాంతంలో ఎవరూ లేరని నిర్ధారించుకుని ఒక బైక్ నుంచి పెట్రోల్ తీసుకొని దర్జాగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.ఈ దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. 

మీరు ఇకనైనా జాగ్రత్త పడకుండే రోజు మీ బైక్ నుంచి పెట్రోల్ మాయమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ బైక్ లను ఇంటి బయట పార్క్ చేయకుండా ఇంట్లో గేటు లోపల పెట్టుకుంటే మీ బైక్ లో పెట్రోల్ సేఫ్ గా ఉంటుంది. లేకపోతే ఉదయం లేచే సరికి మీ బైక్ లో పెట్రోల్ ఉండకపోవచ్చు. 

Leave a Comment