వారికి మాత్రమే రాష్ట్రంలో అనుమతి..

వలస కూలీలు, విద్యార్థులు, చిక్కుకుపోయిన యాత్రికులకు మాత్రమే రాష్ట్రంలో వచ్చేందుకు అనుమతిస్తామని సీఎం జగన్ సర్కార్ స్పష్టం చేసింది. సమీక్ష సమావేశంలో వలస కూలీలు, యాత్రికులు, విద్యార్థుల అంశంపై సీఎం చర్చించారు. వెబ్ సైట్ ద్వారా అప్లయి చేసుకున్న వారిని పరిశీలించిన తర్వాత ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి వారికి అవకాశం కల్పిస్తామని చెప్పింది. కేంద్ర హోం శాక మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలోకి వచ్చేందుకు అనమతి ఇస్తామని తెలిపింది. 

వచ్చే వాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఆయారాష్ట్రాల్లో వాళ్లు గ్రీన్‌జోన్లో ఉన్నారా ? ఆరెంజ్‌ జోన్లో ఉన్నారా? రెడ్‌ జోన్లో ఉన్నారా? అన్న వివరాలు కూడా సేకరిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. వీటిని నిర్ధారించుకుని వలస కూలీలు, చిక్కుకుపోయిన యాత్రికులు, విద్యార్థులకు అనుమతులు మంజూరు చేస్తామన్న అధికారులు తెలిపారు. 

స్పందన వెబ్‌సైట్‌ ద్వారానే కాక వివిధ మార్గాల ద్వారా విజ్ఞప్తులు చేసుకున్న వారు కూడా ఉన్నారని, వ్యక్తిగతంగా వచ్చే వారికి అనుమతి లేదని  అధికారులు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో క్వారంటైన్‌ విధానం ఎలా ఉండాలన్న దానిపై ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల వారీగా సదుపాయాలు ఉండాలని చెప్పామని సీఎం తెలిపారు. దీన్ని ఎలా బలోపేతం చేయాలి అన్న దానిపై దృష్టి పెట్టాలని సీఎం తెలిపారు. అలాగే వచ్చే వారికి చేయాల్సిన పరీక్షల విధానంపై కూడా మార్గదర్శకాలు తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలి..

ఎంఫాన్ తుఫాన్ ఏపీ వైపు వస్తే సన్నద్ధంగా ఉండాలని, తుఫాన్ కదలికలను గమనించాలని సీఎం జగన్ తెలిపారు. విద్యుత్తు, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యశాఖ సన్నద్ధంగా ఉండాలిన్నారు. ఆస్తినష్టం, ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వేట నిషేధ సమయమే అయినా బోట్లలో ఏ ఒక్కరూ సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలన్నారు. కొంతమంది అధికారులను సిద్ధం చేసుకోవాలని, అలాగే కార్యాచరణ కూడా సిద్ధం చేసుకోవాలని సూచించారు. 

తుపానును దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ధాన్యం సేకరణలో అగ్రెసివ్‌గా ఉండాలన్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యం వీలైనంత వరకూ కొనుగోలు చేయాలన్నారు. వర్షాల వల్ల దెబ్బతినడానికి అవకాశం ఉన్న పంటల సేకరణలో వేగం పెంచాలన్నారు.  ప్రతి పంటలో మూడింట ఒక వంతు పంటను మార్కెట్లో జోక్యం కింద కొనుగోలు చేయడానికి అధికారులు సిద్ధం కావాలన్నారు. 

వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు రావాలంటే.. పండే పంటలో మూడింట ఒక వంతు కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. వాటిని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలన్నారు. వాటికి మార్కెట్‌ను ఏర్పాటు చేసుకుని పంపాలన్నారు. ఈ విధానాన్ని వ్యవస్థీకృతం చేసుకుంటేనే ధరల స్థిరీకరణ .

CLICK HERE :- http://spandana1.ap.gov.in/Registration/onlineRegistration

Leave a Comment