ఏపీలో కోవిడ్-19 పరీక్షలు వేగవంతం

రాష్ట్రంలో  కోవిడ్-19 పరీక్షలు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రతి పది లక్షల జనాభాకు 2,345 పరీక్షలు చేస్తున్నారు. ఈ సంఖ్య ఢిల్లీలో 2,224గా ఉంది. తమిళనాడులో 1929, రాజస్థాన్ లో 1402 పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 10292 పరీక్షలు చేసినట్లు అధికారులు వెల్లడించారు9. కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.  

రాష్ట్రంలో పాజిటివిటీ కేసుల శాతం 1.32 కాగా, దేశంలో 3.84 శాతం ఉందని, మరణాల రేటు రాష్ట్రంలో 2 శాతం, దేశంలో 3.27 శాతం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 11 ల్యాబులు పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో రోజువారీ పరీక్షల సామర్థ్యం 6 వేల నుంచి 10 వేలకు పెరిగిందన్నారు. 

కుటంబ సర్వేలో గుర్తించిన 32,792 మందికి రేపటిలోగా టెస్టులు పూర్తిచేస్తామన్న అధికారులు వెల్లడించారు. రెడ్‌ జోన్లలో ఉన్న ఆస్పత్రుల్లో కచ్చితమైన మెడికల్‌ ప్రోటోకాల్‌ పాటించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో వేరీ యాక్టివ్ క్లస్టర్లు 65, యాక్టివ్ క్లస్టర్లు 86, డార్మింటరీ క్లస్టర్లు 46, గత 28 రోజులుగా కేసులు లేన క్లస్లర్లు 50 ఉన్నాయని అధికారులు వివరించారు. 

టెలిమెడిసిన్‌ వ్యవస్థ బలోపేతం కావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కీలకమైన కాల్‌ సెంటర్ల నంబర్లను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలన్నారు.

Leave a Comment