చెడు కొలెస్ట్రాల్ పెరుగితే ఈ లక్షణాలు కనిపిస్తాయి..!

ఈరోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య చెడు కొలెస్ట్రాల్.. జీవనశైలిలో వచ్చిన మార్పులతో దీని బారిన పడుతున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది.. చాలా మంది ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతున్నట్లు నిపుణులు అంటున్నారు. 

అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందని మనకు ఎలా తెలుస్తుంది? అంటే.. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు శరీరం పలు రకాల సంకేతాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సంకేతాల ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. శరీరంలో కలిగే ఈ సంకేతాలను గమనించి వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..  

కొలెస్ట్రాల్ పెరుగుతున్నట్లు తెలిపే సంకేతాలు:

  • శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు చర్మం నీలం రంగులోకి మారుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే..? గుండెలోని ధమనులలో పలు మార్పులు రావడం వల్ల ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి. అయితే ఇది కూడా శరీరంలో హై కొలెస్ట్రాల్ పెరగడానికి సంకేతమని నిపుణులు తెలుపుతున్నారు.
  • ఇటీవలే వైద్యుల అధ్యయనం చేసిన ప్రకారం.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు సోరియాసిస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అధ్యయనం పేర్కొంది.
  • శరీరంలో చెడు కొలస్ట్రాల్ పెరిగితే.. పాదాలపై పొట్టు కూడా క్రమంగా తొలగిపోతుంది. అంతేకాకుండా వాటిపై పొక్కులు కూడా వస్తాయి.
  • చర్మ సమస్యలు రావడం.. తరచుగా చర్మం పొడిబారడం వంటి సంకేతాలు శరీరంలో అధికంగా కొవ్వు పెరగడం వల్లనే వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ కు అన్ని చర్మ సంబంధిత సమస్యలు సంకేతాలు కావు. పైన పేర్కొన్నవే సంకేతాలుగా పరిగణించాలి.
  • కళ్లు పసుపు లేదా నారింజ రంగులోకి మారితే కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని సంకేతాలుగా భావించవచ్చు. శరీరంలో వివిధ రకాల హార్మోన్లు ఉత్పత్తి కావడం వల్ల ఇలాంటి సమస్యలు సంభవించే అవకాశాలు అధికమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కావున ఇలాంటి సమస్యల బారిన పడినప్పుడు తప్పకుండా వైద్యుల సలహా తీసుకొని ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి లేకపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి.

 

 

Leave a Comment