కరీంనగర్ చిన్నారి ప్రాణాలు నిలబెట్టిన సోనూసూద్..!

కొవిడ్ సమయంలో ఎంతో మందికి అండగా నిలిచి రియల్ అనిపించుకున్నారు సోనూసూద్.. సాయం అడిగితే కాదనకుండా చేశారు. ఇంకా తన సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు.. తాజాగా సోనూసూద్ మరోసారి ఉదారత చాటుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన చిన్నరికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలో సాయం చేశారు.. 

కరీంనగర్ కి చెందిన ఏడు నెలల మహ్మద్ సఫాన్ అలీ బిలియరీ అట్రేసియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధితో బాలుడి కాలేయం దెబ్బతిన్నది. తెలంగాణలోని పలు ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్స అందించగా.. విజయవంతం కాలేదు.. ఆ తర్వాత బాలుడు కామెర్లు, సిర్రోసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. దీనికి కాలేయ మార్పిడి అవసరం.. 

దీంతో సోనూసూద్ సహాయంతో బాలుడిని కేరళ రాష్ట్రం కొచ్చిలోని ఆస్టర్ మెడ్ సిటీలో కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. శస్త్ర చికిత్స విజయవంతమైన సందర్భంగా సోనూసూద్ స్పందించారు. వైద్య రంగంలో భారతదేశం ఎంతో ప్రగతిని సాధించిందని తెలిపారు. పేద కుటుంబాల వారు అరుదైన వ్యాధులకు ఖర్చు భరించలేక కష్టాలు పడుతున్నారని వెల్లడించారు. ఆస్టర్ వాలంటీర్లు ప్రారంభించిన సెకండ్ ఛాన్స్ చొరవతో వైద్యం చేయించామన్నారు.. సఫాన్ అలీ ఆరోగ్యంగా ఉండాలని సోనూసూద్ కోరుకున్నారు. 

Leave a Comment