ఐఏఎస్ కి సిద్దమయ్యేవాడిని.. పిచ్చివాడిగా మార్చిన ‘ప్రేమ’..!

ప్రేమ.. ఇది కొంత మందికి అందమైన జీవితాన్ని ఇస్తుంది.. మరి కొంత మంది భవిష్యత్తును నాశనం చేస్తుంది. ప్రేమిస్తే సినిమాలో భరత్ మాదిరిగా.. ప్రేమ విఫలమై పిచ్చివాడిగా మారాడు ఓ యువకుడు.. ఐఏఎస్ కావాలనుకున్న అతడు.. రెండు సార్లూ ప్రేమ విఫలమై బిచ్చగాడిలా మారిపోయాడు.. అతడి దీనగాథ ఏంటో మీరు చదవండి.. 

తమిళనాడులోని తెన్ కాశీ జిల్లా తెన్నమలైకి చెందిన ముత్తు(35) రాజపాలయంలో బీకాం, మద్రాసు యూనివర్సటీలో ఎంబీఏ చదివాడు.. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో గతంలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత చెన్నైలోని ఓ కార్యాలయంలో ఉద్యోగం చేసేవాడు..

ముత్తు మద్రాసు యూనివర్సిటీలో చదివేటప్పుడు ఓ విద్యార్థిని ప్రేమించాడు. ఆ ప్రేమకాస్త విఫలమైంది. ఉద్యోగం చేసేటప్పుడు తనతోటి ఉద్యోగిని ప్రేమించాడు.. అయితే అది కూడా విఫలం అయ్యింది. రెండు ప్రేమలు విఫలం కావడంతో జీవితంపై విరక్తి చెందాడు. 2018 నవంబర్ 13న తాను ఉంటున్న వర్కింగ్ బాయ్స్ హాస్టల్ నుంచి అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు.. బంధువులు అనేక చోట్ల వెతికినా, పోలీసులకు సమాచారం ఇచ్చినా అతడి ఆచూకీ లభించలేదు. 

ఎలా దొరికాడు? 

తెన్నమలై ప్రాంతానికి చెందిన మురగన్ అనే వ్యక్తి ఈనెల 17న తన కుటుంబ సభ్యులతో పర్యాటక యాత్ర కోసం కన్యాకుమారికి వచ్చాడు. చినిగిపోయిన బట్టలు, ఏళ్ల తరబడి క్షవరం చేసుకోకుండా బాగా పెరిగిన మాసిన గడ్డంతో, మానసిక వైకల్యంతో రోడ్డుపై ఉన్న యువకుడిని మురగన్ గమనించాడు. 

అయితే అతడు ముత్తా కాదా అనే సందేహం.. నిర్ధారించుకునేందుకు అతడిని పలుకరించాడు. తన ఊరు, పేరు చెప్పగానే ముత్తు అని నిర్ధారించుకున్నాడు. వెంటనే సమీపంలో భద్రత విధుల్లో ఉన్న పోలీసుల సహాయంతో సెలూన్ కి తీసుకెళ్లి గడ్డం కత్తిరించి గుండు కొట్టించాడు.. ఆ తర్వాత బంధువులకు సమాచారం అందించాడు. బంధువులు వచ్చి అతడిని ముత్తుగా గుర్తించారు..     

Leave a Comment