రెండు నదుల మధ్య భారతదేశం.. ఈ ప్రాంతం ఎక్కడుందో తెలుసా?

కొన్ని సీన్లు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. అవి ఎలా ఉంటాయంటే.. ఎవరో చెక్కినట్లు ఉంటాయి. అలాంటి వాటిలో మన భారతదేశ మ్యాప్ ఆకారం కూడా ఒకటి.. నీటిపై, ఆకాశంపై, లేదా చెట్ల వద్ద ఇలా చాలా ప్రదేశాల్లో మన భారతదేశ ఆకారాన్ని మనం సోషల్ మీడియాలో చాలా సార్లు చూసి ఉంటాం.. రెండు నదుల కలయికతో భారతదేశం మ్యాప్ ఏర్పడిన అస్సాంలోని ఒక ప్రత్యేకమైన ప్రదేశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

అదే అస్సాం రాష్ట్రం బొంగైగావ్ సమీపంలో చంపావతి నది బ్రహ్మపుత్ర నదిలో కలుస్తున్న ప్రదేశం.. ఈ ప్రదేశాన్ని చూస్తే అచ్చం భారతదేశం మ్యాప్ లాగా ఉంటుంది. మీరు ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రాంతాన్ని అస్సామీలో ‘చపోరి’ అని పిలుస్తారు. 

ఈ ఫొటోను ఎరిక్ సోల్హీమ్ అనే ట్విట్టర్ యూజర్ తన అకౌంట్ లో షేర్ చేశాడు. అందులో అతడు రెండు నదులు కలిసే ప్రాంతాన్ని షేర్ చేశారు. అందులో భారత్ దేశం మ్యాప్ కనిపిస్తుంది. అస్సాంలోని బైంగైగావ్ లో చంపావతి నది బ్రహ్మపుత్రలో కలిసే ప్రదేశం ఉంది. ఇది సరిగ్గా భారత్ దేశం మ్యాప్ లాగా ఉంది. అద్భుతమైన మరియు అందమైన భారతదేశం. అంటూ ఎరిక్ క్యాప్షన్ పెట్టాడు. 

ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేల సంఖ్యలో లైక్ లు వచ్చాయి. అలాగే చాలా మంది కామెంట్లు కూడా చేశారు. ‘ఈ ఫొటో షేర్ చేసిందుకు ధన్యవాదాలు’, ప్రతి భారతీయుడు ఈ ప్రదేశాన్ని ఒకసారి సందర్శించాలి’, ‘ఇది చాలా అందమైన దృశ్యం’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు..  

 

Leave a Comment