ఆఫీస్ లో ఫోన్ చార్జ్ చేయడం.. విద్యుత్ చోరీ అంట.. వైరల్ అవుతున్న నోటీస్..!

ఈరోజుల్లో సెల్ ఫోన్ ఒక నిత్యవసర వస్తువు. ప్రస్తుతం ఇంటర్నెట్ వాడకంతో సెల్ ఫోన్ లో చార్జింగ్ ఎప్పుడు అయిపోతుందో తెలీదు.  కాబట్టి ఎక్కడైన బయటకు వెళ్లినప్పుడు చార్జర్ ని కూడా తీసుకెళ్తాం.. ఇక కంపెనీలలో పని చేసే వారు ఆఫీసుల్లో సెల్ ఫోన్ కి చార్జింగ్ పెట్టడం సాధారణం.. 

అయితే ఈ కంపెనీ బాస్ మాత్రం ఆఫీసుల్లో చార్జింగ్ పెట్టడాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. అందుకే ఆఫీస్ లో ఓ నోటీస్ అంటించాడు. దీన్ని చూసిన ఉద్యోగులు షాక్ అయ్యారు. ఆఫీసుల్లో ఎవరూ మొబైల్ ఫోన్లు కానీ, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కానీ చార్జింగ్ చేసుకోకూడదని పేర్కొన్నాడు. ఇలా చేయడం విద్యుత్ ను దొంగలించడం కిందకి వస్తుందని అన్నాడు. ఇలా చేసిన వారి జీతాల్లో నుంచి డబ్బులు కట్ చేయాల్సి వస్తుందని, ఆఫీసుల్లో మొబైల్ ఫోన్లు స్విచ్చాఫ్ చేయాలని ఆ కంపెనీ బాస్ నోటీసులు అంటించారు.

Phone Charging Notice

ఇది ఎక్కడ జరిగిందో తెలీదు కానీ ప్రస్తుతం ఈ నోటీస్ కి సంబంధించిన పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ చర్యలకు పాల్పడిన బాస్ పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అలాంటప్పుడు ఉద్యోగులు ఓవర్ టైం కూడా తీసుకోకూడదని, అది కూడా కరెంట్ ను తప్పుగా వాడడమే అవుతుందని కొందరు అంటున్నారు. మరీ ఈ నోటీస్ పై మీరేమంటారు..   

  

 

Leave a Comment