మీకు సరిగ్గా నిద్ర పట్టడం లేదా.. నిద్రలేమితో వచ్చే సమస్యలు ఇవే..!

మనిసికి తగినంత నిద్ర చాలా అవసరం.. కొంత మంది పనిలో పడి నిద్రను త్యాగం చేస్తుంటారు. నిద్రాహారాలు మానేసి పనులు చేస్తున్నామని చెబుతుంటారు. ఇలా ఎప్పుడూ చేయకూడదు. మనిషికి రోజుకు 7-8 గంటల నిద్ర అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. మనిషికి తగినంత నిద్ర లేకపోతే మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయి. గాలి, నీరు, ఆహారం మనిషికి ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరమని నిపుణులు చెబుతున్నారు. 

మనిషి ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే సరిపోను నిద్ర అవసరమని, నిద్రను నిర్లక్ష్యం చేయడం సరికాదని నిపుణులు అంటున్నారు. మనిషి జీవన నాణ్యత నిద్రపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. గాఢ నిద్రతో మనిషి శరీరం పునర్జీవం పొందుతుందట. నిద్రించే వ్యవధి, నిద్రిస్తున్న సమయంలో ఎలాంటి అవరోధాలు లేకుండా హాయిగా నిద్రపోవడాన్ని నాణ్యమైన నిద్రగా పరిగణిస్తారు. 

అయితే చాలా మందికి వివిధ కారణాలతో రాత్రి సమయంలో త్వరగా నిద్రపట్టదు. బెడ్ పై గంటల కొద్దీ దొర్లుతూనే ఉంటారు. కానీ నిద్రపోలేరు. కళ్లు మూసుకున్న ఏదో ఆలోచనలు వెంటాడుతంటాయి. ఎప్పుడో అర్ధరాత్రి తర్వాత నిద్ర పడుతుంది. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిద్రలేమి వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

నిద్రలేమితో వచ్చే ఆరోగ్య సమస్యలు:

  • గుండె, నరాల సంబంధిత వ్యాధులు.
  • జ్ఞాపకశక్తిని కోల్పోవడం, బరువు పెరగడం.
  • శ్వాస సమస్య వల్ల కలిగే నిద్రా భంగం అబ్ స్ట్రిక్టివ్ స్లీప్ ఆప్నియా ఎంతో ప్రమాదకరం.. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు. 
  • సెల్ ఫోన్ వల్ల కూడా స్లీప్ ఆప్నియా సమస్య వస్తుంది. దీని వల్ల హైపర్ టెన్సన్, రాత్రిపూట సడెన్ గా హార్ట్ ఎటాక్ రావడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, చిరాకు పడటం, ఒత్తిడికి గురికావడం వంటి సమస్యలు వస్తాయి. 
  • వృద్ధాప్యం తర్వగా వస్తుంది. 
  • పిల్లల్లో కూడా నిద్రలేక అలర్జీలు, చిరాకు వంటి సమస్యలు వస్తాయి.
  • నాణమైన నిద్ర కావాలంటే ముందుగా ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 

  

Leave a Comment