ఏపీలో గ్రూప్-1, 2 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌.. పోస్టుల వివరాలు ఇవే..!

 ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో గ్రూప్-1, 2 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జాబ్ క్యాలెండర్ పోస్టుల కంటే అధికంగా ఖాళీల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. గతంలో ఈ కేటగిరీల కింద కేవలం 36 పోస్టులు మాత్రమే ఉన్నాయి. పోస్టుల సంఖ్య పెంచడంతో వాటి సంఖ్య 292కి పెరిగింది. 

 గ్రూప్‌-1లో 110, గ్రూప్‌-02లో 182 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు గ్రూప్స్‌ పోస్టులకు ఏపీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్లు జారీ చేయనుంది. గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీవో, సీటీవో, డీఎస్పీ, డీఎఫ్ఓ, మున్సిపల్ కమిషనర్‌లు, ఎంపీడీవో పోస్టులు ఉండగా..  గ్రూప్-02లో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్‌లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి.

గ్రూప్ -1 పోస్టుల వివరాలు ఇవే..

గ్రూప్-2 పోస్టుల వివరాలు ఇవే..

 

Leave a Comment