ఈ 4 రకాల మనుషులు జాగ్రత్త..కరోనా నుంచి పొంచి ఉన్న ఆ ముప్పు

కరోనా వచ్చి మనుషుల జీవితాలను తలకిందులు చేసేసింది. చాలా మంది కరోనా బారిన పడి ప్రాణాలు వదిలారు. మరికొంత మంది అనాధలయ్యారు. ఇటువంటి సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. కరోనా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా విషయంలో ముఖ్యంగా చెప్పుకునే విషయం ఏంటంటే..లాంగ్ కోవిడ్, పోస్ట్ కోవిడ్ కేసులు ప్రజల్ని మరింత ఆందోళనకరంగా మార్చుతున్నాయి. ఇవి రెండు కోవిడ్ వైరస్‌తో పోరాడుతున్న వారాలు లేదా నెలల తర్వాత రోగులను ఎక్కువ ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ డెల్టా వేరియంట్ కారణంగా ఎక్కువ మంది చాలా కాలం కరోనా బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

కొందరిలో కరోనా లక్షణాలు ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అయితే నాలుగు రకాల వ్యక్తులు పోస్ట్‌కోవిడోసిస్‌కు ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్‌లోని లాంగ్ బీచ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ పరిశోధకులు కొన్ని అధ్యయనాలను చేశారు. వారు ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2020 మధ్య వరకూ కూడా కోవిడ్ బారిన పడిన 366 మందిపై టెస్టులు నిర్వహించారు. వారిలో ఆరోగ్యం, లక్షణాలను అధ్యయనం చేసి కొన్ని విషయాలను కనుగొన్నారు. వారి పరిశోధనల వల్ల కరోనాలో కొత్త వేరియంట్లు కనుగొనబడ్డాయని తెలుస్తోంది. పాజిటివ్ టెస్ట్ చేశాక రెండు నెలల తర్వాత, ఒకే రకమైన రోగులను విశ్లేషించి, వారి లక్షణాల గురించి అడిగి తెలుసుకున్నారు. రెండు నెలల తర్వాత, మూడింట ఒకవంతు రోగులు 1-2 లక్షణాలను కలిగి ఉండటాన్ని వారు గుర్తించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం, వాసన కోల్పోవడం, కండరాల నొప్పులు, నొప్పి మరియు అలసట వంటివి ఉండటాన్ని వారు గుర్తించారు.

 

కోవిడ్ ఉన్న మహిళలు ఇది వరకూ ఏదో ఒక అనారోగ్యానికి గురైనవారుంటారు. కరోనావైరస్ వ్యాధితో పోరాడిన మహిళల్లో ఎక్కువ కాలం పాటు కోవిడ్ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయని నిపుణుల అభిప్రాయం. మహిళలకు తీవ్రమైన లక్షణాలు ఉంటాయి. మహిళలు ఆస్పత్రుల్లో చేరడం చాలా తక్కువగా జరుగుతుంటుంది. వారు ఎల్లప్పుడూ ఒత్తిడితో పనులు చేస్తుంటారు. అందుకే వారిలో జ్ఞాపకశక్తి సమస్యలు, అలసట, రుతు మార్పులు, శరీర నొప్పులు వంటి లక్షణాలు వారిలో కనపడకపోవచ్చు.

ఒక వయస్సులో మనిషికి రోగనిరోధక వ్యవస్థ అనేది కచ్చితంగా తగ్గిపోతుంది. సూక్ష్మక్రిములు, వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించడం ఆ సమయంలో సులభం అవుతుంది. కణ విభజన, పునరుత్పత్తి, వయస్సు సంబంధిత ముందస్తు షరతులను నెమ్మదింపజేయడం వలన శరీరానికి సహజంగా ఇన్ఫెక్షన్లతో పోరాడటం కష్టమయ్యే పరిస్థితులు వస్తాయి. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారిలో కోవిడ్ కేసులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

నల్లజాతీయులలో లాంగ్‌కోవిడ్ ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. జన్యుపరమైన రంగు చాలా భిన్నంగా ఉంటుంది. నల్ల రంగుతో ఉన్నవారు మధుమేహం, గుండె జబ్బులు వంటి వ్యాధులకు ఎక్కువగా గురవుతారు.

రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉన్నప్పుడు కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అది దీర్ఘకాలిక కోలిసైస్టిటిస్ వచ్చే ప్రమాదాన్ని చాలా రెట్లు పెరిగేలా చేస్తుంది. రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇటువంటి వారిలో అంటువ్యాధిని నిర్మూలించే శక్తి తక్కువగా ఉందని పరిశోధనలో కనుగొన్నారు.

Leave a Comment