‘మా’ ఎన్నికలకు ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు వీరే..!

త్వరలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(MAA) ఎన్నికలు జరుగనున్నాయి. అధ్యక్ష పోటీలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, హీరో విష్ణు, నటీమణులు జీవితా రాజశేఖర్, హేమ ఉన్నారు. ఈనేపథ్యంలో ప్రకాశ్ రాజ్ తన ప్యానల్ సభ్యులను ప్రకటించారు. మొత్తం 27 మందితో జాబితాను విడుదల చేశారు. 

ఈసందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ ‘త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే MAA ఎల‌క్ష‌న్స్‌ని పుర‌స్క‌రించుకుని, ‘మా’ శ్రేయ‌స్సు దృష్ట్యా.. నిర్మాణాత్మ‌క ఆలోచ‌న‌ల‌ని ఆచ‌ర‌ణ‌లో పెట్టే దిశ‌గా మా ప్ర‌తిష్ట‌కోసం.. మ‌న న‌టీ నటుల బాగోగుల కోసం.. సినిమా న‌టీన‌టులంద‌రి ఆశీస్సుల‌తో.. అండ‌దండ‌ల‌తో.. ఎన్నిక‌ల‌లో నిల‌బ‌డటం కోసం.. ప‌ద‌వులు కాదు ప‌నులు మాత్ర‌మే చేయ‌డం కోసం.. ‘మా’ టీంతో రాబోతున్న విష‌యాన్ని తెలియ‌ప‌రుస్తున్నాం’ అంటూ ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. 

ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు వీరే:

  1. ప్ర‌కాష్‌రాజ్‌
  2. జ‌య‌సుధ‌
  3. శ్రీకాంత్‌
  4. బెన‌ర్జీ
  5. సాయికుమార్‌
  6. తనీష్‌
  7. ప్ర‌గ‌తి
  8. అన‌సూయ‌
  9. స‌న
  10. అనిత చౌద‌రి
  11. సుధ‌
  12. అజ‌య్‌
  13. నాగినీడు
  14. బ్ర‌హ్మాజీ
  15. ర‌విప్ర‌కాష్‌
  16. స‌మీర్‌
  17. ఉత్తేజ్  
  18. బండ్ల గణేష్  
  19. ఏడిద శ్రీరామ్‌
  20. శివారెడ్డి
  21. భూపాల్‌
  22. టార్జాన్ 
  23. సురేష్ కొండేటి
  24. ఖ‌య్యుం
  25. సుడిగాలి సుధీర్
  26. గోవింద‌రావు
  27. శ్రీధ‌ర్‌రావు

 

Leave a Comment