మటన్ కూర వండలేదని ఆగిపోయిన పెళ్లి..!

అతిథి మర్యాదలు సరిగ్గాలేవనే కారణంతో మగ పెళ్లి వారు అహంకారంతో వివాహా వేదికలు వదిలి వెళ్లిపోయే ధోరణి ఎప్పుడో పాత కాలంలో ఎక్కువగా ఉండేవి.. తాజాగా అలాంటి ఘటనే ఒడిశాలో జరిగింది. మటన్ కూర వండలేదని పెళ్లి ఆగిపోయింది. 

వివరాల మేరకు ఒడిశాలోని కెంజోర్ జిల్లా రెబనాపలాస్ పాల్ కి చెందిన యువకుడు రమాకాంత్ పాత్రోకి జాజ్ పూర్ జిల్లా మనతిరా గ్రామంలోని యువతితో బుధవారం రాత్రి పెళ్లి జరగాల్సి ఉంది. బుధవారం మధ్యాహ్నం బంధుమిత్రులతో వరుడు ఆ యువతి గ్రామానికి చేరుకున్నాడు. వధువు కుటుంబం వారికి ఘన స్వాగతం పలికింది. తర్వాత అక్కడ విందు ఏర్పాటు చేసింది. 

అయితే విందులో మటన్ కర్రీ కావాలని తోడు పెళ్లి కొడుకు, మరి కొందరు డిమాండ్ చేశారు. తాము మటన్ కర్రీ వండలేదని వధువు కుటుంబ చెప్పింది. దీంతో వరుడు తరఫు వారు వాగ్వాదానికి దిగారు. ఈ వివాదం చివరికి ఘర్షణకు దారితీసింది. మటన్ కర్రీ వండలేదన్న కోపంతో తాను ఈ పెళ్లి చేసుకోనని చెప్పి వరుడు వెళ్లిపోయాడు. 

వధువు కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా రాజీ కాలేదు. చివరికి పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిన వరుడు రమాకాంత్ పాత్రో అతడి కుటుంబ సభ్యులు కుహికా పంచాయతీ పరిధిలోని గాంధపాలం గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేశారు. మరుసటి రోజు తమ్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫులాజారా ప్రాంతానికి చెందిన మరో యువతిని పాత్రో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Leave a Comment