ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు..!

ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్ద అయినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంటర్ పరీక్షలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగిందని, సుప్రీం ఆదేశాల ప్రకారం జూలై 31 నాటికి పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని పేర్కొన్నారు. 

అందుకే టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో మార్కులు ఎలా ఇస్తామన్న విషయాన్ని తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. మార్కులను కేటాయించే క్రమంలో ఒక హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తామని, హైపవర్ కమిటీ నివేదిక తర్వాత మార్కులపై నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. 

 

Leave a Comment