రైల్వే బోర్డు జారీ చేసిన కొత్త నిర్ణయాలు ఇవే..

కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో రేపటి నుంచి ప్రత్యేక రైళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ నుంచి పలు ప్రాంతాలకు రైళ్లు నడపనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 15 రూట్లలో 30 రైళ్లు అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో టికెట్ బుకింగ్ సౌకర్యం కల్పించింది. దీనికి సంబంధించి రైల్లే బోర్డు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. 

రైల్వే బోర్డు జారీ చేసిన మార్గదర్శకాలు..

  •  ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్‌ బుకింగ్‌ సౌకర్యం
  •  ఐఆర్‌సీటీసీ ఏజెంట్ల ద్వారా టికెట్ల బుకింగ్‌కు అను  మతులు ఉండవు.
  •  ఏడు రోజుల ముందుస్తు రిజర్వేషన్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది.
  •  కేవలం ఖరారైన టికెట్లు మాత్రమే జారీ చేస్తారు.
  •  వెయిటింగ్ లిస్ట్, ఆర్‌ఏసీ, తత్కాల్, కరెంట్ బుకింగ్ టికెట్లు జారీ చేయరు.
  •  ఆన్‌లైన్లో మాత్రమే టికెట్లను క్యాన్సిల్ చేసుకునే అవకాశం.
  •  టికెట్‌ను 24గంటల ముందుగా రద్దు చేసుకోవాలి. 50% రుసుము మాత్రమే తిరిగి చెల్లిస్తారు.
  •  రైళ్లలో ప్రయాణికులకు ఆహార పదార్థాలను సరఫరా చేసే బాధ్యత ఐఆర్‌సీటీసీదే.
  •  టికెట్ బుకింగ్ సమయంలోనే ఐఆర్‌సీటీసీలో ఆహారం బుక్‌ చేసుకునే సదుపాయం.
  •  గతంలో రాజధాని రైళ్లలో కల్పించిన దుప్పట్లు, టవల్స్ సరఫరాను ఈ ప్రత్యేక రైళ్లలో ఇవ్వడం లేదు

 

Leave a Comment