మరో రెండేళ్లలో టోల్ గేట్లు ఉండవు..!

వచ్చే రెండేళ్లలో దేశంలో టోల్ గేట్లు ఉండవని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రష్యా సహకారంతో టోల్ గేట్ల స్థానంలో జీపీఎస్ వ్యవస్థ ప్రవేశపెడుతామని ప్రకటించారు. కొత్తగా వచ్చే వాహనాల్లో జీపీఎస్ పనిచేస్తోందని, మిగితా వాటిల్లో ట్రాకింగ్ కిట్ అమరుస్తామని తెలిపారు. 

దీంతో వాహనం ఎన్ని కిలోమీటర్లు తిరిందనేది తెలుస్తందన్నారు. దానిని బట్టి వినియోగదారుడి బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్ ఫీజు కట్ అవుతుందన్నారు. ఈ పద్ధతి రష్యాలో విజయవంతం అయిందని, అక్కడ టోల్ గేట్లను ఎత్తేసి వాహనదారులను ఫ్రీగా వదిలిపెడతారని పేర్కొన్నారు. వారు ప్రయాణించిన దూరాన్ని బట్టి వారి అకౌంట్ లో నుంచి డబ్బు కట్ అవుతుందన్నారు. 

ఈ పద్ధతినే దేశంలో కూడా అమలు చేయనున్నారన్నారు. రోడ్డపై వెళ్లితే చాలు ఇప్పుడు కొన్ని కిలోమీటర్లు వెళ్లాక టోల్ గేట్లు దర్శనమిస్తాయన్నారు. ఎక్కువ దూరం వెళ్తే రెండు మూడు కనిపిస్తాయని, అక్కడ టోల్ కట్టి మనం రోడ్ల మీద ప్రయాణించడం అదనపు భారం అవుతుందని పేర్కొన్నారు. పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు కిలోమీటర్ల కొద్దీ వాహనాలు టోల్ గేట్ల వద్ద నిలిచిపోతుంటాయన్నారు. ఈ పరిస్థితిని తప్పించేందుకు రష్యాలో వాడుతున్న సాంకేతికతను ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. 

Leave a Comment