నిర్మాత దిల్ రాజు పుట్టినరోజు వేడుకలు..!

ప్రముఖ నిర్మాత దిల్ రాజు శుక్రవారం తన 50వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దీనిని పురస్కరించుకుని ముందు రోజు రాత్రి ఆయన హైదరాబాద్ లో బర్త్ డే పార్టీ గ్రాండ్ గా ఇచ్చారు. ఈ పార్టీకి తెలుగు సినీ నటులు హైజరై శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ పార్టీలు పవన్ కళ్యాణ్, చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ, రాక్ స్టార్ యశ్, రామ్ పోతినేని, బెల్లంకొండ సురేష్ తదితరులు ఈ పార్టీకి హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   

 

Leave a Comment