కానిస్టేబుల్ తో లేడీ ఎస్సై అక్రమసంబంధం..!

నెల్లూరు జిల్లాలో ఓ లేడీ ఎస్సై, కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారంపై తన కాపురం నిలబెట్టాలని కానిస్టేబుల్ భార్య జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. కానిస్టేబుల్ భార్య ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఎస్పీ, దిశ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఆ లేడీ ఎస్సైని వీఆర్ కి పంపించారు. 

ఈ వ్యవహారం జరిగిన తర్వాత కూడా వారిద్దరి మధ్య ప్రేమాయణం ఆగలేదు. దీంతో లేడీ ఎస్సై వలలో చిక్కుకున్న తన భర్తను విడిపించుకోడానికి బాధితురాలు మరోసారి ఎస్పీని ఆశ్రయించింది. పదే పదే తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తుండటంతో ఏకంగా లేడీ ఎస్సై కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి అతని భార్యతో వాగ్వాదానికి దిగింది.           

ఇంతలో బాధితురాలు మీడియాకు సమాచారం ఇవ్వడంతో.. ఎస్సై అక్కడి నుంచి చల్లగా జారుకుంది. ఆత్మకూరు డివిజన్ పరిధిలో సదరు లేడీ ఎస్సై, కానిస్టేబుల్ ఒకే పోలీస్ స్టేషన్లో పనిచేసేటప్పుడు ఈ లవ్ స్టోరీ మొదలైనట్టు తెలుస్తోంది. కానిస్టేబుల్ పెంచల సాయిది కలువాయి మండలం బ్రాహ్మణపల్లి. దీంతో ఈ వ్యవహారంపై కానిస్టేబుల్ భార్య మొదట కలువాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వత ఎస్పీ దగ్గరకు వెళ్లి తనకు న్యాయం చేయాలని కోరింది. కానిస్టేబుల్ ఇంట్లో.. లేడీ ఎస్సై కి, కానిస్టేబుల్ భార్యకి మధ్య జరిగిన గొడవతో ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.

 

Leave a Comment