ఆ దాడిలో ముస్లింలు ఎవరూ లేరు : మహారాష్ట్ర హోం మంత్రి

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో గత వారం ముగ్గురు వ్యక్తులపై జరిగిన ముఠా దాడిలో 101 మందిని అరెస్టు చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్య చెప్పారు. అయితే వారిలో ఎవరూ కూడా ముస్లింలు లేరని స్పష్టం చేశారు. 

ఈ ఘటనలో మతపరమైన రంగు ఆపాదించేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకుల ప్రయత్నాలను మంత్రి తిప్పికొట్టారు. ఈ కేసును మహారాష్ట్ర సీఐడీకు అప్పగించినట్లు ధ్రువీకరించారు. 

గతవారం పాల్ఘర్ జిల్లాలోని గాడ్చిన్ చలే గ్రామానికి చెందిన కొందరు కర్రలు, రాళ్లతో ముగ్గరు వ్యక్తులపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు చనిపోయారు. వీరిలో ఇద్దరు సాధువులు  ఉన్నారు. ఈ ఘటనను బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు మతపు రంగు పులిమేందుకు ప్రయత్నించారు. సాధువులను ముస్లింలు చంపారని ఆరోపించారు. 

అయితే ఈ దాడిలో ఒక్కరు కూడా ముస్లిం లేరని, ఇప్పటి వరకు 101 మందిని అరెస్టు చేశామని మంత్రి చెప్పారు. ఈ దాాడికి మతపరమైన రంగు ఇవ్వద్దని కోరారు. ఈ దాడిని హిందూ-ముస్లిం కోణంలో చూడద్దని సీఎం కార్యాయలం నుంచి కూడా ఒక ట్విట్ వచ్చింది. 

 

Leave a Comment