ఆండ్రాయిడ్ ఫోన్ ఫాంట్ స్టైల్ ని ఎలా మార్చాలి ?

ఈ పోస్ట్ ద్వారా మనం ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్ యొక్క ఫాంట్ స్టైల్ ని ఎలా మార్చాలో తెలుసుకుందాం .సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్ లో ఫాంట్ స్టైల్ ని మార్చుకోవాలి అనుకున్నప్పుడు మొబైల్ ని రూట్ చేయవలసి ఉంటుంది . ఆలా అయితే నే మొబైల్ యొక్క ఫాంట్ స్టైల్ అనేది మారుతుంది . కాని మనం చాలా సులభం గ ఈ మోడల్ ఆండ్రాయిడ్ ఫోన్ ఫాంట్ స్టైల్ అయినా మార్చుకోవచ్చు . అందుకోసం మొబైల్ ని రూట్ చేయవలసిన అవసరం కూడా లేదు .

playstore ఇందుకోసం ఒక అప్లికేషన్ మనకు సహాయపడుతుంది . ఈ అప్లికేషన్ ని ఉపయోగించి ఫాంట్ స్టైల్ ని మార్చుకోవచ్చు .అప్లికేషన్ పేరు Zfont మీరు ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవటం కోసం కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి . అయితే ఈ అప్లికేషన్ ని ఫ్రీ గ వాడుకోవచ్చు కానీ ఇందులో చాలా రకాల యాడ్స్ వస్తూ ఉంటాయి . ఇక ఈ అప్లికేషన్ ని ఎలా వాడాలో తెలుసుకుందాం .

1. ముందుగా ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి .
2.తర్వాత ఇంస్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి .అందులో మీకు చాలా రకాల ఫాంట్ స్టైల్స్ అనేవి కనిపిస్తాయి .
3. మీకు పైన STYLES అనే ఆప్షన్ కనిపిస్తుంది .అక్కడ క్లిక్ చేయండి అందులో మీకు ఫాంట్ స్టైల్స్ కనిపిస్తాయి .
4.ఇప్పుడు మీరు మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ ని సెలెక్ట్ చేయండి . కింద డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది క్లిక్ చేసి సెట్ ఆప్షన్ ని కూడా క్లిక్ చేయండి .
5. ఇక మొబైల్ ఫోన్ ని ఒక సాలరీ ఆఫ్ చేసి ఆన్ చేయండి .
6. మీ మొబైల్ లో ఫాంట్ స్టైల్ అనేది మారిపోతుంది ,
7. ఇలా చాలా సులభం గ మీ మొబైల్ యొక్క ఫాంట్ స్టైల్ ని మార్చుకోవచ్చు .

Download app

Leave a Comment