అక్కడ ‘బుల్లెట్ బైక్’ కు ఆలయం కట్టి పూజిస్తున్నారు..!

దేశంలో ఒక్కొక్కరు ఒక్కో దేవుణ్ని పూజిస్తారు. అందుకు దేశంలో పూజించే దేవతలు, బాబాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే బైక్ ను ఎవరైనా పూజిస్తారా? కాని ఇక్కడ పూజిస్తారు. బుల్లెట్ బండినే దైవంగా భావిస్తారు. నమ్మకం కలగడం లేదా? అయితే రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఉన్న ‘ఓం బన్నా..బుల్లెట్ బాబా’ ఆలయాన్ని సందర్శించాల్సిందే..

జోధ్ పూర్ కు 47 కి.మీ. దూరంలో ఉన్న పాలి జాతీయ రహదారి పక్కన ఈ ఆలయం ఉంది. 350 సీసీ రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ బైక్ ను ఇక్కడ నిత్యం పూజిస్తారు. ఎందుకంటే 1988 డిసెంబర్ 2న ఓమ్ బన్నా అనే వ్యక్తి నేషనల్ హైవే బుల్లెట్ బైక్ పై ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తూ మరణించాడు. దీంతో పోలీసులు బుల్లెట్ బైక్ ను స్వాధీనం చేసుకుని స్టేషన్ లో పెట్టారు. 

అయితే ఆ తర్వాతి రోజు ఆ బైక్ పోలీసులకు కనిపించలేదు. దాని కోసం వెతుకగా ప్రమాదం జరిగన ప్రదేశంలోనే కనిపించింది. ఎవరో ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావించారు. ఆ బైక్ ను మళ్లీ స్టేషన్ కు తరలించారు. ఆ బండిలో పెట్రోల్ కూడా పూర్తిగా తీసేశారు. 

ఆ తర్వాతి రోజు కూడా ఆ బైక్ కనిపించలేదు. తిరిగి ప్రమాదస్థలంలోనే కనిపించింది. దీంతో పోలీసులు ఆ బుల్లెట్ ను అక్కడే వదిలేశారు. ఈ విషయం స్థానికంగా ప్రచారంలోకి వచ్చింది. దీంతో స్థానికులు తమకు ప్రమాదాలు జరగకుండా ఆ బైక్ ను పూజించడం ప్రారంభించారు. ఈ బైక్ కు ఆలయం కట్టి పూజలు చేసేందుకు ప్రత్యేకంగా అర్చకుడిని కూడా నియమించారు. అక్కడే ఓం బన్నా విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజిస్తారు..  

Leave a Comment