ఏపీలో కొత్తగా 13 మంది జేసీలు

రాష్ట్రంలో పథకాలు మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు 13 మంది కొత్త జాయింట్ కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా నిర్ణయంతో జిల్లాలకు ముగ్గురు జేసీలు ఉండబోతున్నారు. కాగా ఇప్పటికీ జిల్లాకు ఇద్దరు జాయింట్ కలెక్టర్లు ఉన్నారు. ముగ్గరు జేసీల శాఖలను కూడా ప్రభుత్వం బదలాయించింది.  రైతు భరోసా, రెవెన్యూ శాఖ.. గ్రామ, వార్డు, సచివాలయాల అభివృద్ధి.. ఆసరా, సంక్షేమ శాఖలకు ఒక్కోరి చొప్పున ప్రత్యేకంగా కొత్త జేసీలను నియమించింది. వీరికి మరికొన్ని శాఖలకు సంబంధించిన బాధ్యతల్ని అప్పగించింది. 

1) రైతు భరోసా, రెవెన్యూ శాఖ జేసీ : అగ్రి కల్చర్‌, సివిల్‌ సప్లయ్స్‌, మార్కెటింగ్‌ అండ్‌ కోఆపరేషన్‌, అనిమల్‌ హస్బండరీ, హార్టికల్చర్‌, ఫిషరింగ్‌, సెరీకల్చర్‌, రెవెన్యూ అండ్‌ సర్వే, నాచురల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఇరిగేషన్‌, లా అండ్‌ ఆర్డర్‌, ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌, మై‍న్స్‌ అండ్‌ జీయోలజీ, ఎనర్జీ 

2) గ్రామ, వార్డు సచివాలయాల అభివృద్ధి జేసీ : డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ విలేజ్‌ అండ్‌ వార్డ్‌ సెక్రటేరియట్‌ అండ్‌ విలేజ్‌ అండ్‌ వార్డ్‌ వాలంటీర్స్‌, పంచాయితీ రాజ్‌, హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌, స్కూల్‌ ఎడ్యూకేషన్‌, టెక్నికల్‌ ఎడ్యూకేషన్‌, హైయ్యర్‌ ఎడ్యూకేషన్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌, హౌసింగ్‌, మీ సేవా, ఆర్‌టీజీ అండ్‌ ఐటీఈ అండ్ సీ డిపార్ట్‌మెంట్‌, ఆల్‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌(ఎనర్జీ, ఇరిగేషన్‌ మినహా)

3) ఆసరా, సంక్షేమ శాఖ జేసీ : రూరల్‌ డెవలప్‌మెంట్‌, ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌, ఎస్సీ వెల్ఫేర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్, మైనారిటీస్ వెల్ఫేర్‌, ఇండస్ట్రీస్‌ అండ్‌ కామర్స్‌, ఎండో మెంట్స్‌, స్కిల్‌ డెవలెప్‌ మెంట్.

 

Leave a Comment