ఈ సింపుల్ డ్రింక్ తో మీ నిద్రలేమికి చెక్ పెట్టండి..

మీరు ఎంత ప్రయత్నించినా రాత్రి నిద్ర పట్టడం లేదా? మంచి నిద్ర కోసం చేయని ప్రయత్నాలు లేవా? అయితే మీరు ఈ చిన్న చిట్కాతో పాటిస్తే మీకు వెంటనే మంచి నిద్ర పట్టుతుంది. నిద్ర లేమికి అనేక కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, ఆందోళన నిద్రలేమికి ముఖ్యమైన కారణాలు. మీరు రాత్రి సమయంలో ఒక డ్రింక్ తీసుకోవడం వల్ల మీకు మంచి నిద్ర పడుతుంది. 

అవును..మీ వంట గదిలోనే ఉన్న ఈ పదార్థం మీరు వెంటనే నిద్ర పోవడానికి సహాయపడుతుంది. ఆ పదార్థం వేరేదేం కాదు నిమ్మకాయే. నిమ్మకాయ ఒత్తడిని తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనల్లో తేలింది. నిమ్మకాయను రాత్రి పూట తీసుకుంటే నిద్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. నిమ్మకాయ మీ నిద్ర హార్మోన్లను సక్రియం చేస్తుంది. 

ఒత్తడిని తగ్గిస్తుంది…

నిద్ర సరిగ్గ పట్టకపోవడానికి ఒత్తడి అతిపెద్ద కారణంగా చెప్పోచ్చు. ఒత్తిడికి చాలా కారణాలు ఉండవచ్చు. చాలా మంది తమ ప్రొఫెషనల్ లో ఒత్తిడికి గురవుతుంటారు. మరి కొందరు వ్యక్తిగత సమస్యలతో బాధపడుతుంటారు. మనస్సు ఒత్తిడితో నిండినప్పుడు నిద్రపోవడం అసాధ్యం అనిపిస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉన్న నిమ్మకాయ ఒత్తిడిని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. నిమ్మకాయను డ్రింక్ రూపంలో తీసుకోవడం వల్ల నిద్ర హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. ఇక్కడ మేము నిమ్మకాయతో తయారు చేసిన చాలా సరళమైన డ్రింక్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. 

కావలసినవి..

  • నిమ్మకాయ
  • ఉప్పు
  • ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు

లెమన్ డ్రింక్ తయారీ విధానం..

  • నిమ్మకాయను రెండు భాగాలుగా కోయండి.
  • తరువాత ఒక గ్లాసులో నిమ్మరసాన్ని పిండుకోండి. 
  • గ్లాసులో నీరు పోసి నిమ్మరసాన్ని బాగా కలపాలి.
  • నీటిలో ఒక చిటికెడు ఉప్పు వేసి బాగా కలపండి.

అంతే నిద్రలేమికి లెమన్ డ్రింక్ రెడీ..ఈ డ్రింక్ ను పడుకునే అరగంట ముందు తీసుకోవాలి. ఇలా రెండు నుంచి మూడు రోజులు తీసుకోవడంతోనే మీకు నిద్రలో తేడా అనేది కనిపిస్తుంది. ఇది ఒక సాధారణ పానీయమే కానీ నిద్రలేమిని తగ్గించడానికి చాలా సహాయపడుతుంది. 

 

Leave a Comment