ప్రియురాలితో సీక్రెట్ షాపింగ్.. భార్యకు అడ్డంగా దొరికిన భర్త.. !

ప్రియురాలితో షాపింగ్ చేస్తూ తన భార్య వద్ద అడ్డంగా బుక్కయ్యాడు ఓ భర్త. ఇంకేముంది కోపంతో తన భర్తను రోడ్డు మీద వాయించింది భార్య. ఈఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో చోటుచేసుకుంది. వివరాల మేరకు మీరట్ కు చెందిన అద్నాన్ కు 2020 ఫిబ్రవరిలో ఆయేషాతో వివాహం జరిగింది. 

పెళ్లి జరినప్పటి నుంచి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దీంతో ఇద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ఈక్రమంలో అద్నాన్ తన ప్రియురాలితో తిరగడం ప్రారంభించాడు. ఈ బాగోతం బయటపడకుండా జాగ్రత్తపడ్డాడు. 

కానీ ప్రియురాలితో అద్నాన్ షాపింగ్ చేస్తూ భార్య ఫ్రెండ్ కంట పడ్డాడు. ఆమె వెంటనే విషయాన్ని ఆయేషాకు తెలిపింది. దీంతో అక్కడికి చేరుకున్న ఆయేషా భర్తను చితకబాదింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరినీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

ఆయేషాకు విడాకులు ఇచ్చానని పోలీసుల ముందు అద్నాన్ తెలిపాడు. అయితే విడాకుల పత్రాలు చూపించాలంటూ ఆయేషా సవాల్ విసరగా.. అద్నాన్ చూపించలేకపోయాడు. గతంలో అద్నాన్ తనపై దాడి చేశాడని ఆయేషా ఆరోపించింది. అయితే భర్తను వేరే మహిళతో చూడలేకపోయిన ఆయేషా అతడిని కొట్టిందని పోలీసులు తెలిపారు. వీరిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.   

,center>

Leave a Comment