ఈ డిజిటల్ ఇమేజ్ ధర రూ.501 కోట్లు..!

ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఓ డిజిటల్ ఇమేజ్ వేలం వేయగా రూ.501 కోట్లకు అమ్ముడైంది. ఈ డిజిటల్ ఇమేజ్ కేవలం ఒక JPEG ఫైల్.. ‘ఎవ్రీడేస్ – ది ఫస్ట్ 5000 డేస్’ అనే పేరుతో అమెరికన్ ఆర్టిస్ట్ మైక్ వింకెల్మన్(బీపిల్) ఈ ఇమేజ్ ను రూపొందించాడు. 

ఈ డిజిటల్ వర్క్ 5 వేల ఇమేజ్ లను గ్రూప్ చేసినట్లుగా ఉంటుంది. ఈ ఇమేజ్ లను రోజుకు ఒకటి చొప్పున 13 సంవత్సరాల పాటు మైక్ శ్రమించి తయారు చేశాడు. దీనిని నాన్ ఫంగబుల్ టోకెన్(ఎన్ఎఫ్టీ) అని పిలుస్తారు. వీటిని డిజిటల్ కళాకృతులు అని అంటారు. 

ఈ డిజిటల్ ఆర్ట్ వర్క్ ను బ్లాక్ చెయిన్ ను ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేస్తారు. వీటి క్రయవిక్రయాలు క్రిప్టోకరెన్సీ ద్వారా జరుగుతాయి. బీపుల్ అనే డిజిటల్ ఆర్టిస్ట్ ప్రతి రోజూ ఇలాంటి చిత్రాలను రూపొందిస్తుంటాడు. పాలులర్ క్రిప్టోకరెన్సీ ఎథెరియం ద్వారా ఈ డిజిటల్ ఫొటోల క్రయ విక్రయాలు జరుగుతాయి.

Leave a Comment