ఆంటీ అని పిలిచినందుకు అమ్మాయిని చితకబాదిన మహిళ..!

మీరు ఎవరినైనా ఆంటీ అని పిలుస్తున్నారా? అయితే జాగ్రత్త.. ఒకవేళ మీ పిలుపు ఆవతలి వారికి నచ్చకపోతే ఇక అంతే.. వారితో చివాట్లయినా తినాలి లేక దెబ్బలైన తినాలి.. ఎందుకంటే కొందరు మహిళలకు వారిని ఆంటీ అని పిలవడం అస్సలు నచ్చదు.. ఇందుకు ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘటనే నిదర్శనం..

ఏంజరిగిందంటే.. యూపీలోని ఈటాలోని బాబూగంజ్ మార్కెట్ లో కొందరు మహిళలు షాపింగ్ చేస్తున్నారు. షాపింగ్ చేస్తున్న సమయంలో ఓ మహిళను మరో యువతి ఆంటీ..ఆంటీ అని పిలిచింది. అంతే ఆమెకు పట్టరాని కోపం వచ్చేసింది. ‘నన్ను ఆంటీ అంటావా’ అంటూ అమ్మాయి జుట్టు పట్టుకుని మరీ కొట్టింది. 

అయితే ఆమె అలా కొడుతుంటే ఆపాల్సింది పోయి అక్కడే ఉన్న మరికొందరు మహిళలు ఆమెకు సాయం చేయడం గమనార్హం..సమీపంలో ఉన్న ఓ మహిళ కానిస్టేబుల్ అక్కడికి చేరుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఇందుకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంటీ అంటే కొడతారా? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.  

Leave a Comment