కింగ్ కోహ్లీకి హ్యాపీ బర్త్ డే..!

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన 32వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.  ఈ తరుణంలో విరాట్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా విరాట్ కోహ్లీని అంతర్జాతీయ క్రికెట్ లో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా పరిగణిస్తారు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో 50 కంటే ఎక్కవ సగటు సాధించిన ఏకైక బ్యాట్స్ మెన్ గా చెప్పొచ్చు. 

2008లో వన్టేలతో కోహ్లీ భారత క్రికెట్ జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 86 టెస్టులు, 248 వన్డేలు, 82 టీ20 మ్యాచులు ఆడాడు. కోహ్లీ ఇప్పటి వరకు ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. విరాట్ కోహ్లీ రికార్డులు సంపాదించుకోవడంలోనే కాదు.. డబ్బు సంపాదించడంలోనూ ముందంజలో ఉన్నాడు. విరాట్ కోసం బ్రాండ్లు వెంటపడుతుంటాయి. ఫోర్బ్స్ లెక్కలను బట్టి చేస్తే ఈ ఏడాది అత్యధిక మొత్తాన్ని సంపాదించుకున్న వారిలో విరాట్ కోహ్లీ 66వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఉన్న ఏకైక భారతీయ క్రీడాకారుడు కోహ్లీ..

ఇక కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘నీకు అన్ని ఆనందాలు, ప్రేమ దక్కాలి’ అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. ‘రెడ్ అండ్ గోల్డ్ కోసం రక్తం, చెమట, కన్నీళ్లు ఇచ్చిన వ్యక్తి..మా నాయకుడు కింగ్ కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కెప్టెన్ కు ఉద్దేగభరితమైన ట్వీట్ చేసింది.  

 

Leave a Comment