హుస్సేన్ సాగర్ పరిధిలో నైట్ బజార్లు.. ఇక రాత్రంతా షాపింగ్..!

హుస్సేన్ సాగర్ తీరానికి కొత్త సొబగులు అద్దేందుకు తెలంగాణ మున్సిపల్ శాఖ నిర్ణయించింది. సాగర తీరంలో నైట్ బజార్ ను ప్రారంభించాలని తీర్మానించింది. సంజీవయ్య పార్కు నుంచి బుద్ధ భవన్ వరకు హుస్సేన్ సాగర్ తీరం వెంబడి ఈ నైట్ బజార్ ను అభివృద్ధి చేయనున్నారు. దీంతో పర్యాటకానికి మరింత ఆకర్షణ వస్తుందని అధికారులు భావిస్తున్నారు. 

పీపీఈ పద్ధతిలో నైట్ బజార్ల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానిస్తామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్కొన్నారు. అదే పద్ధతిలో ఈ బజార్లను  అభివృద్ధి చేస్తామన్నారు. బోర్డు వాక్, పార్కింగ్, సిట్టంగ్ తదితర సౌకర్యాలతో నైట్ బజార్లను ఏర్పాటు చేస్తామన్నారు. 

సుమారు 1300 విస్తీర్ణంలో నైట్ బజార్ రూపంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. రూ.15 కోట్ల అంచనాతో ప్రాజెక్టుకు టెండర్లను ఆహ్వానించనున్నారు. చార్మినార్ సమీపంలోని చూడి బజార్ తరహాలో నైట్ బజార్ ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపు 150 నుంచి 200 దుకాణాలు ఇక్కడ ఏర్పడే అవకాశం ఉంది. 

ఈ నైట్ బజార్ లో గార్మెంట్స్, గాజులు, వెడ్డింగ్ మెటీరియల్, జువెలరీ, ఇయర్ రింగ్స్ తో పాటు పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులనున విక్రయించనున్నారు. ఫుడ్ కోర్టులు, ఆధునిక లైటింగ్ సిస్టం, సిట్టింగ్, వుడ్ ప్లాస్టిక్ కంపోజిట్ డెక్ ఏర్పాటు చేయనున్నారు. ఆసక్తి కనబరిచిన ఏజెన్సీకి తొలుత పది సంవత్సరాల పాటు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. 

Leave a Comment