హోం గార్డుతో అఫైర్.. మహిళను చితక్కొట్టి కిటికీకి తాడుతో చేతులు కట్టేశారు..!  

హోంగార్డుతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ మహిళపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇంటి బయట కిటికీకి తాడుతో చేతులు కట్టేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో చోటుచేసుకుంది. వివరాల మేరకు ఇల్లందులోని ఎల్బీఎస్ నగర్ లో నివాసం ఉంటున్న ఒంటరి మహిళ కిరాణా షాపులో పనిచేస్తుంది. 

ఇల్లందు పోలీస్ స్టేషన్ లో హోం గార్డ్ గా పనిచేస్తున్న నరేష్ ఆదివారం మధ్యాహ్నం సదరు మహిళ ఇంట్లో ఆమెతో  మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో నరేష్ తల్లితో పాటు అతడి బంధువులు ఆ మహిళ ఇంటిపై దాడి చేశారు. ఆమెను విచక్షణారహితంగా కొట్టి బయట కిటికికీ తాడుతో చేతులు కట్టేశారు. అయితే ఆ మహిళ మాత్రం నరేష్ తన వద్ద నుంచి కొందరికి డబ్బులు ఇప్పిస్తాడని, డబ్బుల కోసం వచ్చాడని చెబుతుంది. 

గత కొన్ని రోజులుగా నరేష్ ఇంటికి సరిగా రాకపోవడం, తరుచుగా ఆ మహిళ ఇంటికి వెళ్లడం తదితర కారణాల వల్ల ఆ మహిళకు నరేష్ కి మధ్య అఫైర్ కొనసాగుతుందని నమ్మిన ఆయన బంధువులు ఆ మహిళపై దాడికి పాల్పడ్డారు. పోలీసుల జోక్యంతో ఈ గొడవ సద్దుమణిగింది.    

Leave a Comment