హృదయ విదారకం.. రైస్, ఉల్లిపాయలు, వెల్లుల్లి.. ఇదే అతడి లంచ్ బాక్స్..!

ప్రస్తుతం ఫేస్ బుక్ లో ఓ ఫొటో వైరల్ అవుతోంది. మలేషియాకు చెందిన అపిత్ లిడ్ అనే ఫేస్ బుక్ యూజర్ తన అకౌంట్ లో ఈ ఫొటోను షేర్ చేశాడు. ఈ ఫొటోలో సెక్యూరిటీ గార్డ్ డ్రెస్ ధరించిన ఓ వ్యక్తి లంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అతడి లంచ్ బాక్స్ లో నీటిలో కలిపిన అన్నం.. ఓ ఉల్లిపాయ, మూడు వెల్లుల్లి పాయలు మాత్రమే ఉన్నాయి. 

ఫొటోతో పాటు అతడికి సంబంధించిన వివరాలను సైతం షేర్ చేశాడు అపిత్ లిడ్.. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి తన స్నేహితుడని తెలిపాడు. చాలా కష్టపడి పనిచేస్తాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం కుటుంబానికి దూరంగా వేరే ప్రదేశంలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడని తెలిపాడు. తన జీతంలో అత్యధిక భాగం కుటుంబానికే పంపిస్తాడని, తన కోసం చాలా తక్కువ మొత్తం ఉంచుకుంటాడని పేర్కొన్నాడు.

అలా మిగిల్చుకున్న డబ్బులో ఇలాంటి భోజనం చేస్తాడని తెలిపాడు. ప్రతి రోజూ ఇదే అతడి ఆహారం అని, దీని గురించి అతడు బాధపడడని తెలిపాడు. తన భోజనాన్ని ఎంతో ప్రేమిస్తాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇతడి జీవితం తమకు ఓ పాఠం నేర్పుతుందని నెటిజన్లు చెబుతున్నారు. ఉన్నంతలో సర్దుకుపోయే నీ తత్వానికి గ్రేట్ అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.  

 

Leave a Comment