నగ్నంగా బాల్కనీలో వచ్చిన మహిళలు.. అరెస్ట్ చేసిన పోలీసులు..!

కొంత మంది మహిళలు బాల్కనీలో నిల్చుని నగ్న ప్రదర్శన చేేశారు. దీంతో అసభ్యతను వ్యాప్తి చేస్తున్నారనే కారణంగా సదరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన దుబాయ్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెరీనా మార్కెట్ ఏరియాలో ఓ అపార్ట్ మెంట్ బాల్కనీలోకి పగటి పూట కొంత మంది మహిళలు వివస్త్రలుగా మారి నిల్చున్నారు. 

ఈ విషయాన్ని గమనించిన కొంత మంది వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో పోలీసుల దృష్టికి చేరింది. దీంతో పోలీసులు ఆ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అసభ్య ప్రవర్తనతో ప్రజలను అసౌకర్యానికి గురిచేసినందుకు సదరు మహిళలపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎమిరేట్ సంస్కృతి సంప్రదాయాలను కాలరాసే విధంగా ఉన్న ఇలాంటి విలువలు లేని ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, అందుకే క్రిమినల్ కేసు నమోదు చేశామని వెల్లడించారు.  

Leave a Comment