మూడో విడత రేషన్ పంపిణీ.. జగన్ సర్కార్ నిర్ణయం..

లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పేదలకు మూడో విడత రేషన్ పంపిణీ చేయనుంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు మూడో విడత రేషన్ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే సరకులు ఎలా ఇవ్వాలి..ఏ సరకులు ఇవ్వాలి..సోషల్ డిస్టెన్స్ ఏ విధంగా పాటించాలి..అనే అంశాలపై రెవెన్యూ అధికారులకు, డీలర్లకు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి కోన శశిధర్ మార్గదర్శకాలు జారీ చేశారు. 

  • బియ్యం కార్డు దారులకు ఈ నెల 29 నుంచి మే 10వ తేదీ వరకు రేషన్ దుకాణాల ద్వారా ఉచిత సరుకుల పంపిణీ చేస్తారు. 
  • కరోనా నిబంధనల మేరకు భౌతికదూరం పాటిస్తూ రేషన్ తీసుకునేలా చర్యలు తీసుకున్నారు.
  • టైం స్లాట్ టోకెన్ లతో ఒక్కో షాపులో రోజుకు 30 మందికే సరుకుల పంపిణీ ఉంటుంది.
  • మొదటి, రెండు విడతల్లో వీఆర్వో లేదా ఇతర అధికారుల బయో మెట్రిక్ ద్వారానే రేషన్ అందించారు..అయితే ఈసారి మాత్రం లబ్దిదారుల బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు.
  • కరోనా జాగ్రత్తల్లో భాగంగా అన్ని రేషన్ షాపుల వద్ద శానిటైజర్ వాడాలి.  మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. 
  • ప్రతి లబ్దిదారుడు బయోమెట్రిక్ ఉపయోగించే ముందు శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకునేలా డీలర్లు జాగ్రత్త వహించాలి.

 

Leave a Comment