మ్యూచువల్ ఫండ్ల కోసం రూ.50వేల కోట్ల లిక్విడిటీ సౌకర్యాన్ని ప్రకటించిన ఆర్బీఐ

అమెరికాకు చెందిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎపిసోడ్ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్ల కోసం రూ.50వేల కోట్ల విలువైన ప్రత్యేక లిక్విడిటీ సదుపాయాన్ని రిజర్వ బ్యాంక్ సోమవారం ప్రకటించింది.  ఈ రంగంలో ద్రవ్య ఒత్తిడిని తగ్గించేందుకు మరియు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకుంది. 

ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ భారతదేశంలో ఆరు క్రీయాశీల మ్యూచువల్ ఫండ్లను శుక్రవారం మూసివేసింది. ఇది మ్యూచువల్ ఫండ్ రంగంలో భయాందోళనలను రేకెత్తిస్తోంది. ఈ చర్య అనేక ఇతర క్రియాశీల మ్యూచువల్ ఫండ్లపై ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు భయపడ్డారు. కోవిడ్-19 నుంచి ఉత్పన్నమయ్యే ఆర్థిక నష్టాలను తగ్గించేందుకు అన్ని రంగాలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆర్బీఐ పేర్కొంది. 

  • SLF-MF కింద ఆర్బీఐ 90 రోజుల టేనర్ రెపో ఆపరేషన్లను ఫిక్స్ డ్ రెపో రేటుతో నిర్వహిస్తుంది. SLF-MF ఆన్-ట్యాప్ మరియు ఓపెన్-ఎండెడ్ మరియు ఏరోజైనా నిధులు పొందటానికి బ్యాంకులు తమ బిడ్లను సమర్పించడానికి అనుమతించబడతాయి. 
  • ఈ పథకం సోమవారం నుంచి 2020 మే 11 వరకు లేదా కేటాయించిన మొత్తాన్ని వినియోగించే వరకు అందుబాటులో ఉంటుంది. 
  • SLF-MF కింద లభించే నిధులను మ్యూచువల్ ఫండ్ల లిక్విడిటీ అవసరాలను తీర్చడానికి బ్యాంకులు ప్రత్యేకంగా ఉపయోగించవ్చని పేర్కొంది.
  • భవిష్యత్తులో నెలకొన్న మార్కెట్ పరిస్థితులను బట్టి కాలక్రమేన మొత్తాన్ని సమీక్షిస్తామని ఆర్బీఐ తెలిపింది. 

Leave a Comment