JioMart వాట్సాప్ ఆర్డర్ బుకింగ్ సర్వీస్ ప్రారంభం..ఆర్డర్ చేయడం ఎలా?

రిలయన్స్ రిటైల్ ద్వారా నిర్వహించబడుతున్న ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అయిన JioMart లాక్ డౌన్ సమయంలో కొత్త వాట్సాప్ ఆర్డర్ బుకింగ్ సేవను ప్రారంభించింది. దీని కోసం ఒక కొత్త JioMart వాట్సాప్ నెంబర్ ను ప్రవేశపెట్టింది. అవసరమైన వస్తువుల కోసం JioMart ఇప్పుడు ఆర్డర్లు తీసుకుంటుంది. ఆర్డర్లను 48 గంటల్లో చేరవేస్తున్నట్లు తెలిపింది. 

రిలయన్స్ జియోలో ఫేస్ బుక్ 9.99 శాతం వాటాను తీసుకున్న వారం తర్వాత ఈ కొత్త సర్వీస్ ను ప్రారంభించింది. ప్రస్తుతం దీనిని మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో పరీక్షించనుంది. అయితే JioMart ప్రస్తుతం వస్తువులను డోర్ డెలివరీ చేయడం లేదని, వినియోగదారులు డెలివరీని తీసుకోవడానికి సమీపంలోని కిరాణ దుకాణానికి వెళ్లాలని సూచించింది. అయితే వాట్సాప్ ద్వారా JioMart లో ఎలా ఆర్డర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

JioMart లో ఆర్డర్ చేయడం ఎలా?

  • ముందుగా మీ ఫోన్ లో +918850008000 నెంబర్ ను JioMart గా సేవ చేయాలి. 
  • తర్వాత మీరు వాట్సాప్ ఓపెన్ చేసి JioMartలో ‘Hi’ అనే మెసేజ్ ను పంపండి. 
  • వెంటనే మీకు ఒక మెసేజ్ వస్తుంది. ప్రస్తుతం అందులో నవీ ముంబాయి, థానే మరియు కల్యాణ్ ప్రాంతాల్లో మాత్రమే ఈ సేవ అందుబాటులో ఉందని మెసేజ్ లో ఉంటుంది.
  • రాత్రి 7 గంటలకు ముందు మాత్రమే జియోమార్ట్ ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. వచ్చే రెండు రోజుల్లో JioMart కిరాణా స్టోర్ వద్ద మీ ఆర్డర్లు తీసుకోవచ్చు. 
  • మీకు వచ్చిన మెసేజ్ లో ఒక లింక్ ఉంటుంది.అయితే మీకు వచ్చిన లింక్ ను 30 నిమిషాలలోపు మాత్రమే ఉపయోగించాలి. లేకపోతే దాని వాలిడిటి ముగుస్తుంది. మీరు తిరిగి ‘Hi’ అనే మెసేజ్ పంపాల్సి ఉంటుంది.
  •  మీకు వచ్చిన లింక్ పై క్లిక్ చేస్తే JioMart యొక్క పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ వివరాలు ఇచ్చి Proceed బటన్ పై క్లిక్ చేయాలి. 
  • తరువాత మీ సమీప కిరాణా దుకాణాల్లో అందుబాటులో ఉన్న వస్తువుల జాబితాను చూపిస్తుంది. 
  • మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత చెల్లించాల్సిన మొత్తాన్ని JioMart చూపిస్తుంది. వెంటనే మీకు మరొక వాట్సాప్ మెసేజ్ కూడా పంపుతుంది. 
  • అందులో మీ సమీపంలోకి కిరాణా స్టోర్ పేరు మరియు చిరునామా, మీరు ఆర్డర్ తీసుకోవాల్సిన ప్రదేశం వివరాలు ఉంటాయి. విచారణ కోసం ఫోన్ నెంబర్ కూడా అందిస్తుంది. మీ ఆర్డర్ పికప్ సమయంలో మాత్రమే చెల్లింపులు చేయాలి.
  • కిరాణా దుకాణాన్ని సరిగ్గా గుర్తించడానికి JioMart గూగుల్ మ్యాప్స్ లింక్ ను కూడా పంపుతుంది. 

Leave a Comment