ఇది బొమ్మ కాదు.. నిజమైన తుపాకీ..!

ఈ ఫొటో కనిపించేది బొమ్మ రివాల్వర్ అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే..ఇది బొమ్మ కాదు.. ఒక నిజమైన రివాల్వర్..ట్రిగ్గర్ నొక్కితే చాలు తూటాలను వెదజల్లేస్తుంది. ఈ రివాల్వర్ ఇటీవల గిన్నీస్ రికార్డును సొంతం చేసుకుంది. స్విట్జర్లాండ్ కు చెందిన ఆయుధాల తయారీ సంస్థ ఈ మినీ గన్ ను తయారు చేసింది. 

ఈ రివాల్వర్ పొడువు 5.5 సెంటీమీటర్లు, ఎత్తు 3.5 సెంటీమీటర్లు ఉంటుంది. దీని బరువు 19.8 గ్రాములు ఉంటుంది. దీని ఖరీదు 6,300 స్విస్ ఫ్రాంకులు అంటే మన కరెన్సీలో రూ.5.14 లక్షలు.. ఈ రివాల్వర్ కొంటే దీనితోపాటు ఒక లెదర్ కేసు, 24 తూటాలు ఉచితంగా ఇస్తారు. ఈ రివాల్వర్ లో కూడా సాధారణ రివాల్వర్ మాదిరిగానే 6 బుల్లెట్ పడతాయి. అయితే అమెరికా, బ్రిటన్ సహా కొన్ని దేశాలు ఈ రివాల్వర్ ను దిగిమతి చేసుకోవడంప నిషేధం విధించాయి. 

Leave a Comment