ఈ పాన్ ధర రూ.5 వేలు.. తింటే వయాగ్రా అవసరమే ఉండదు..!

పురుషుల్లో అంగస్తంభన సమస్యలు ప్రస్తుత కాలంలో ఎక్కువయ్యాయనే చెప్పొచ్చు. సమస్యను అధికమించేందుకు మార్కెట్లో రకరకాల మందులు గురించి, వయాగ్రా గురించి వినుంటారు. కానీ మీరు ఎప్పుడైనా అంగస్తంభన కోసం పాన్ ను వాడొచ్చని విన్నారా?  అవునండి దీని కోసం ప్రత్యేకంగా పాన్ లభిస్తుంది. దీని ధర అక్షరాల రూ.5 వేలు ఉంది. 

మహారాష్ట్రలోని ఓరంగాబాద్ లో తారా పాన్ సెంటర్ ను ఓ వ్యక్తి 50 సంవత్సరాలుగా నడుపుతున్నాడు. ఇక్కడ లభించే ‘కోహినూర్ పాన్’(Kohinoor Paan)కి చాలా ప్రత్యేకత ఉంది. ఈ పాన్ మగవారి అంగాన్ని 48 గంటల పాటు గట్టిగా ఉంచుతుంది. అంటే ఇది వయాగ్రా ట్యాబ్లెట్ల కంటే ఎక్కువగా పనిచేస్తుంది. ఈ పాన్ ధర అక్షరాల 5 వేల రూపాయలు ఉంటుంది. దీనిని కొనేందుకు కొత్తగా పెళ్లయిన పురుషులు క్యూ కడుతుంటారు. 

అయితే ఈ పాన్ సీక్రెెట్ ఆ షాప్ యజమాని మహ్మద్ సిద్దికీకి మాత్రమే తెలుసట. ఈ పాన్ లో వాడే పదార్థాలు కూడా చాలా ఖరీదైనవే.. ఈ పాన్ కి వాడే కస్తూరి కిలో రూ.70 లక్షలు, కుంకుమ పువ్వు కిలో రూ.70 వేలు, గులాబ్ కిలో రూ.80 వేలు, అగర్ కిలో రూ.7 లక్షలు ఉంటుంది.  అందుకే ఈ పాన్ ధర కూడా రూ.5 వేలు ఉంది. పెళ్లిళ్ల సీజణ్ లో ఈ పాన్ కు భారీ డిమాండ్ ఉంటుంది. అంతే కాదు ఆడవారి కోసం కూడా ప్రత్యేకంగా పాన్ ఉంటుందట. ఇక పెళ్లి కొడుకుకు వాళ్ల ఫ్రెండ్స్ ఈ పాన్ ను గిఫ్ట్ గా కూడా ఇస్తుంటారు.   

Leave a Comment