బాబోయ్.. పెళ్లి కానుకలు చేస్తే దిమ్మదిరగాల్సిందే..!

కూతురి పెళ్లి ఘనంగా చేయాలని ప్రతి తండ్రీ కోరుకుంటాడు. అల్లుడికి తమ స్థాయికి తగ్గట్టు కట్నకానుకలు సమర్పించుకుంటాడు. అయితే తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నాయకుడు మాత్రం తరతరాలు గుర్తుండిపోయేలా వేడుకలు చేయాని తలిచాడు. అతను తన కుమార్తె పెళ్లి సందర్భంగా ఇచ్చిన కానుకలు చేస్తే షాక్ అవ్వాల్సిందే. 20 కుటుంబాలకు సరిపడా వస్తు సామగ్రిని సమర్పించుకున్నాడు. 

ఆ లిస్ట్ చూస్తే మీరు షాకవుతారు. 2 కిలోల బంగారు నగలు, రెండు బైకులు, ఓ ఖరీదైన కారు, ట్రాక్టర్ లతో పాటు ఇంటి సరంజామా, బియ్యం బస్తాలు, పశువులు, మేకలు ఇలా కవాల్సినవన్ని సమర్పించాడు. పెళ్లి కూడా ఓ తిరునాళ్ల తరహాలో అంగరంగ వైభవంగా జరిగింది. వందలమందితో ఊరేగింపులు, విందులు, వినోదాలతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు…

Leave a Comment