మాస్క్ పెట్టుకోలేదని.. జవాన్ ను కాళ్లతో ఇష్టమొచ్చినట్లు కొట్టిన పోలీసులు.. వీడియో వైరల్..!

దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం అర్పిస్తారు జవాన్లు.. అలాంటి జవాన్ కు పోలీసులు దారుణంగా అవమానించారు. మాస్క్ పెట్టుకోలేదని జవాన్ ను పోలీసులు చితకబాదారు. కాళ్లతో ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రం ఛత్రా జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. 

కరోనా నిబంధనలు అమల్లో భాగంగా ఛత్రా పట్టణంలోని కర్మా బజార్ ప్రాంతంలో పోలీసులు మాస్క్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆర్మీ జవాన్ పవన్ కుమార్ యాదవ్ మాస్క్ పెట్టుకోకుండా బైక్ పై వస్తున్నాడు. దీంతో పోలీసులు జవాన్ బైక్ ని ఆపి బండి తాళాలు లాగేసుకున్నారు. పోలీసుల చర్యను జవాన్ నిరిసస్తూ బండి తాళాలు ఇవ్వాలని అడిగాడు. 

దీంతో పోలీసులకు, జవాన్ కు మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న మిగితా కానిస్టుబుల్స్ అక్కడకు చేరుకుని పవన్ కుమార్ ను దారుణంగా కొట్టారు. రౌండప్ చేసి కాళ్లతో తన్నారు. అనంతరం జవాన్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై ఛత్రా ఎస్పీ రాకేశ్ రంజన్ స్పందించారు. జవాన్ పట్ల దురుసుగా ప్రవర్తించిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. తక్షణమే నివేదిక సమర్పించాలని ఆదేశించారు.   

Leave a Comment