చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతూ ఫోన్ పేలి యువతి మృతి..!

చార్జింగ్ లో పెట్టి ఫోన్ మాట్లాడం ఎంతో ప్రమాదకరం. అది ఎన్నోసార్లు రుజువైంది. ఫోన్ చార్జింగె పెట్టి వాడటం వల్ల అందులో నుంచి మంటలు రావడం, బ్యాటరీ పేలి గాయపడటం వంటి ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ఓ యువతి ఫోన్ చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుంగా ఆమె ఇంటిపై పిడుగు పడింది. దీంతో ఆమె మరణించింది. ఈ ఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది.

ఉత్తర బ్రెజిల్ లోని శాంటారెమ్ లో నివసిస్తున్న రాడ్జా ఫెరీరా డి ఒలివేరా (18) ఆదివారం ఉదయం తన ఫోన్ ఉపయోగిస్తుండగా.. ఆమె ఇంటిపై పిడుగుపడింది. దీంతో ఆమె విద్యుత్ షాక్ కు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. 

అయితే బ్రెజిల్ లో ఈ తరహా ఘటన ఇది మూడోసారి జరిగింది. గతవారం కూడా అపోలినారియా జిల్లాలో చార్జింగ్ పెన్ ఉపయోగిస్తుండగా.. పిడుగుపడి ఓ వ్యక్తి మరణించాడు. అలాగే కౌన్సిలర్ రాయ్ ముండో బ్రిటో కూడా ఇలా చార్జింగ్ పెట్టిన ఫోన్ ఉపయోగించి.. పిడుగుపాటుకు గురి అయ్యాడు. 

ఇక మన ఇండియాలోనూ గత జూలైలో ఇలాంటి ఘటనే జరిగింది. గుజరాత్ కు చెందిన శ్రద్దా దేశాయ్(17) అనే యువతి ఫోన్ చార్జింగ్ పెట్టి కాల్ లిఫ్ట్ చేసింది. ఆమె ఫోన్ లో మాట్లాడుతుండగా ఫోన్ పేలి ప్రాణాలు కోల్పోయింది..సో చార్జింగ్ లో పెట్టి ఫోన్ మాట్లాడం ఎప్పుడు చేయకండి.. ఏ సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేం.. 

Leave a Comment