పీఎం ప్యాకేజీ ఒక జోక్..: సోనియా గాంధీ

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మండిపడ్డారు. ఈ ప్యాకేజీ ఒక క్రూయేల్ జోక్ గా మిగిలిందని వ్యాఖ్యానించారు. కరోనాను ఎదుర్కోవడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం జాతీయర స్థాయి వివక్షాలతో ఆమె సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి సంసిద్ధత లేకుండా మార్చి 24న కేవలం 4 గంటల వ్యవధిలో లాక్ డౌన్ ప్రకటించారని మండిపడ్డారు. అయినా ప్రభుత్వానికి వివక్షాలు మద్దతు ప్రకటించాయన్నారు. 21 రోజుల మొదటి విడత లాక్ డౌన్ లో సత్ఫలితాలు వస్తాయని అనుకున్నమని, ప్రస్తుతం వ్యాక్సిన్ వచ్చే వరకు వైరస్ తో ఉండే పరిస్థితు ఉన్నాయని తెలిపారు. 

లాక్ డౌన్ 4 అమలు చేస్తూ బయటపడే విధానం లేకుండా ఉన్నట్లు అనిపిస్తోందని చెప్పారు. టెస్టింగ్ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. కరోనా మహమ్మారి కారణంగా వలస కూలీలు తీవ్రంగా దెబ్బతిన్నారని, వారితో పాటు 13 కోట్ల మంది రైతులు, చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని వ్యాఖ్యానించారు. 

Leave a Comment