వ్యక్తి నుంచి వ్యక్తికే కరోనా వ్యాప్తి..

కరోనా విషయంలో ఎన్నో వదంతులు..ఎన్నో అనుమానాలు..వస్తువులను ముట్టుకుంటే వస్తుంది..కరెన్సీ నోట్లను తాకితే కరోనా వస్తుంది..అయితే ఈ వదంతులను అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్(సీడీసీ) కొట్టిపారేసింది. 

కరోనా రోగి తాకిన వస్తువులు లేదా పరిసరాలను ముట్టుకుంటే కరోనా అంత సులువుగా వ్యాపించదని తేల్చింది. ఈ విషయంలో ఎటువంటి ఆధారాలు లేవని సీడీసీ అధ్యయనంలో వెల్లడించింది. ఈ అధ్యయన నివేదికను అంతర్జాతీయ మీడియా ‘ది వాషింగ్టన్ పోస్ట్’ ప్రచురించింది. 

అయితే వ్యక్తి నుంచి వ్యక్తికే కరోనా సోకుతుందని చెప్పింది. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తితో నేరుగా కలవడం, వారి ద్వారా వచ్చిన ఇతరులను కలవడం, వారి పక్కనే ఉండటం వల్ల వస్తుందని తెలిపింది. కరోనా వచ్చిన వ్యక్తి ముట్టుకున్న వస్తువులను, ఉపరితలాలను తాకడం వల్ల కరోనా వచ్చినట్లు స్పష్టమైన అధారాలు లేవని సీడీసీ వెల్లడించింది. కానీ కరోనా రోగి తాకిన వస్తువులను, పరిసరాలను సాధారణ వ్యక్తి తాకి ముక్కు, నోరు లేదా కళ్లను తాకడం వల్ల కరోనా రావొచ్చని తెలిపింది. అందుకోసం పరిసరాలను ఎప్పటికప్పడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది.  కరోనా సోకిన వ్యక్తి, లేదా లక్షణాలు ఉన్న వారు ఇంట్లో ఐసోలేషన్ లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో సీడీసీ పలు సూచనలు చేసింది. 

సీడీసీ చేసిన సూచనలు..

  • కరోనా రోగి గదిలో గాలి, వెలుగురు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. దీని వల్ల వారి శ్వాసకోశ బిందువులు బయటకు వెళ్లడానికి వీలుంటుంది. 
  • కరోనా రోగి ఉండే ఇంటిని శుభ్రంగా ఉంచాలి. వస్తువులను, ఉపరితలాలను, సూక్ష్మక్రిములు, ధూళి, మలినాలను తొలగించాలి.
  • స్వీచ్ లు, హ్యాండిల్స్, డెస్క్ లు, మరుగుదొడ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను శుభ్రపరచాలి.
  • టచ్ స్కీన్ లను ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ తో తుడవాలి.
  • ఉపరితలాలను శుభ్రపరిచేటప్పుడు చేతి తొడుగులు వాడాలి. 

 

Leave a Comment