నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

అమెజాన్ లో 50 వేల ఉద్యోగాలు

కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ చితకిల పడింది. చాలా కంపెనీలు ఆర్థికంగా కోలుకోలేక మూతపడుతున్నాయి. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ కష్టకాలంలో అమెజాన్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. తమ కంపెనీలో 50 మంది సిబ్బంది అవసరమని, డిమాండ్ కు అనుగుణంగా వీరిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. 

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా 50 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపింది. భారతదేశంలో అమెజాన్ కేంద్రాలు, డెలివరీ నెట్ వర్క్ లో ఈ అవకాశాలు  ఉంటాయని చెప్పింది. కరోనా మహమ్మారి సమయంలో ఈ అవకాశలు కల్పిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. 

Leave a Comment