చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తున్నారన్న వార్త అవాస్తవం 

అన్నయ్యకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు 

 జనసేన పి.ఎ.సి. సభ్యులు నాగబాబు 

ఒక రాజకీయ పార్టీ అన్నయ్య చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వబోతోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో  ఏ మాత్రం నిజం లేదని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు నాగబాబు స్పష్టం చేశారు. అన్నయ్య చిరంజీవి తన సినిమా కెరీర్ పై దృష్టి పెట్టారని, కళారంగానికే జీవితం అంకితం చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఈ మేరకు బుధవారం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నాగబాబు వీడియోను పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “చిరంజీవి రాజకీయాలు వద్దనుకున్నారు. ఆయన కావాలనుకుంటే దేశంలో ఏ పార్టీ అయినా ఘనస్వాగతం పలికి రాజ్యసభ సీటు ఇస్తుంది అని నాగబాబు చెప్పారు.

 పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశారు 

 అన్నయ్య చిరంజీవి గారు ఏ రాజకీయ పార్టీకి సపోర్టు చేయడం లేదని నాగబాబు తెలిపారు.  తమ తమ్ముడు పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే తను రాజకీయాల్లో ఉండకూడదని చిరంజీవి త్యాగం చేశారన్నీరు. అన్నయ్య పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నారన్నారు. ఆయన నిర్ణయాన్ని కుటుంబం మొత్తం స్వాగతించామన్నారు. 

అమరావతికి సంపూర్ణ మద్దతు 

 రాజధానిపై చిరంజీవి తన అభిప్రాయాన్ని చెప్తే విజయవాడకు చెందిన కొందరు నిర్మాతలు ఏదేదో మాట్లాడేశారన్నారు. అలా అభిప్రాయాలు చెప్పడం తప్పా అని ప్రశ్నించారు.  ఆయన ఇంటి ముందు ధర్నాలు చేయాలనే ఆలోచన మానుకోవాలన్నారు. తాను, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ అమరావతికి తమ వంతు సపోర్ట్ చేస్తున్నామన్నారు.

 

Leave a Comment