పెరిగిన బంగారం ధర..!

దేశంలో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. బుధవారం పలు పట్టణాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర  రూ.1200 పెరిగి రూ.44,000 దాటిపోయింది. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరగడం, రూపాయి విలువ పడిపోవడం దీనికి ప్రధానక కారణంగా చెప్పొచ్చు. 24 క్యారెట్టల 10 గ్రాముల ధర బుధవారం ఒక్కరోజులోనే రూ.1200 పెరిగి 44,750రూపాయలకు చేరింది. 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ.41,000కు చేరింది. వెండి కిలో ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ.47,500 పలుకుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 భయాలు, దీంతో తమ పెట్టుబడులకు బంగారాన్ని సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్లు భావిస్తుండడంతో బంగారానికి అంతర్జాతీయంగా బలాన్ని ఇస్తున్నాయి.    

Leave a Comment