బైక్ లో పెట్టిన రూ.3 లక్షలు ఎత్తుకెళ్లిన కోతి..!

ఉత్తరప్రదేశ్ లో ఓ కోతి ఏకంగా రూ.3 లక్షలు దొంగతనం చేసింది. ఓ వ్యక్తి రూ.3 లక్షల నగదును ఓ పేపర్లో చుట్టి బైక్ కవర్లో పెట్టగా సడెన్ గా వచ్చిన ఓ కోతి దాన్ని ఎత్తుకుపోయి అతడికి చుక్కలు చూపించింది. హార్దోయి జిల్లాలో సాండీ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఆశిష్ సింగ్ ఆర్థిక లావాదేవీల నిమిత్తం రూ.3 లక్షల నగదును కవర్లో చుట్టి బైక్ లో పెట్టాడు. 

ఓ చోట బైక్ పార్క్ చేసి పక్కకు వెళ్లాడు. అక్కడ సడెన్ గా వచ్చిన ఓ కోతి నగదు ఉన్న కవర్ ను ఎత్తుకెళ్లింది. ఎత్తుకెళ్లి చెట్టు మీద కూర్చింది. దీంతో ఆశిష్ తన కవర్ ఇచ్చేయాలని కోతిని బతిమాలాడు. అయినా ఆ కోతి కవర్ ను విడిచిపెట్టలేదు. 

దీంతో విసిగిపోయిన ఆశిష్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. అతడు వెళ్లిన కాసేపటికి కోతి ఆ కవర్ ను కింద పడేసింది. అది గమనించిన ఓ సెక్యురిటీ గార్డు కవర్ విప్పి చూడగా నగదు కనిపించింది. దీంతో అతడు నిజాయతీగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి అప్పగించాడు. 

అప్పటికే ఆశిష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డబ్బు అతడిదే అయి ఉంటుందని నిర్ధారించుకున్నారు. అతడు చెప్పిన అన్ని ఆధారాలు ఉండటంతో డబ్బును అతడికి అప్పగించారు. నిజాయతీగా డబ్బును ఇచ్చిన సెక్యురిటీ గార్డును పోలీసులు అభినందించారు. 

Leave a Comment