జెండా ఎగురవేశాడని.. దళిత సర్పంచ్ పై దాడి..!

మధ్యప్రదేశ్ లో అమానూష ఘటన జరిగింది.. ఓ దళిత వ్యక్తి జాతీయ జెండా ఎగురవేశాడని.. ఆ గ్రామ కార్యదర్శి అతనిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుందేల్ ఖండ్ లో చోటుచేసుకుంది. వివరాల మేరకు ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఛత్తర్ పూర్ లోని ధాంచీ గ్రామస్తులు స్థానిక పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేయడానికి ఏర్పాట్లు చేశారు. 

ఈ కార్యక్రమానికి ఆ గ్రామ కార్యదర్శి సునీల్ తివారిని ఆహ్వానించారు. అయితే సునీల్ తివారి సమాయానికి రాలేదు. దీంతో గ్రామస్తులు గ్రామ సర్పంచ్ హన్ను బాసర్ ను జెండా ఎగురవేయాలని కోరారు. వారి కోరిక మేరకు హన్ను బాసర్ జెండాను ఎగురవేశారు. 

జెండా కార్యక్రమం పూర్తయిన కాసేపటికి సునీల్ అక్కడికి చేరుకున్నాడు. తనను కాదని నువ్వు జెండా ఎలా ఎగురవేశావని ఆగ్రహంతో ఊగిపోయాడు. కోపంతో విచక్షణ కోల్పోయి దళిత సర్పంచ్ పై పిడిగుద్దులు కురిపించాడు. అడ్డొచ్చిన సర్పంచ్ భార్య, కోడలిపై  కూడా దాడి చేశాడు. దీంతో సునీల్ పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Leave a Comment