చివరి క్షణంలో.. ఈ అమ్మాయి నాకొద్దు అన్న వరుడు..!

పెళ్లికి అంతా సిద్ధమైంది. పెళ్లి కూతురు కూడా ఈ అబ్బాయి తనకిష్టమని చెప్పింది. ఇక పెళ్లి కొడుకు మాత్రమే పెళ్లికి అంగీకరించాలి. కానీ చివరి క్షణంలో వరుడు ట్విస్ట్ ఇచ్చాడు.  ఈ అమ్మాయి నాకొద్దని చెప్పాడు.. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన శుక్రవారం బోధన్ లో జరిగింది. 

వివరాల మేరకు తెలంగాణ రాష్ట్రం బోధన్ లోని శక్కర్ నగర్ కాలనీకి చెందిన యువకుడికి రాకాసీపేట్ కు చెందిన యువతితో పెళ్లి ఫిక్స్ అయింది. పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో డిసెంబర్ 5న పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. దీంతో శుక్రవారం ఉదయం ఇరు కుటుంబాలతో పాటు బంధువులు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు చర్చికి చేరుకున్నారు. 

పెళ్లి జరిపిస్తున్న చర్చి ఫాదర్ నీకు అబ్బాయి ఇష్టమా అని అమ్మాయిని అడిగాడు. తనకు ఈ అబ్బాయి ఇష్టమే అని అమ్మాయి చెప్పంది. తర్వాత అబ్బాయికి ఆ అమ్మాయి నీకు ఇష్టమేనా అని అడగగా అబ్బాయి మొహం చాటేశాడు. ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోనని చెప్పాడు. దీంతో అందరు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇరు కుటుంబాల వారు అబ్బాయిని ఎంత చెప్పినా వినకపోవడంతో చివరికి పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. 

Leave a Comment