పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం.. పిట్టల్లా పడిపోతున్న జనం..!

పశ్చిమ గోదావరి జాల్లా ఏలూరులో భయానక పరిస్థితి ఏర్పడింది. అక్కడ జనాలు పిట్టల్లా పడిపోతున్నారు. నోటి వెంట నురగలు కక్కుతూ చిన్నారులు, యువకుడు, వృద్ధులు సొమ్మసిల్లి పోతున్నారు. ఏలూరులోని పడమర వీధి, దక్షిణపు వీధి, కొత్తపేట, వంగాయగూడెం, కొబ్బరితోట ప్రాంతాల్లో బాధితులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఉన్నట్లుండి వారు మూర్ఛతో పడిపోతున్నారు. ఇప్పటి వరకు ఏలూరులో 227 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరికీ ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

కాగా, గత మూడు రోజులుగా తాగునీరు రంగు మారి వస్తుందని, కలుషిత నీరు తాగడం వల్లే ఇలా జరిగి ఉంటుందని బాధితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఆస్పత్రిలో చేరిన వారెవరికీ ప్రాణపాయం లేదదు. కలుషిత నీరు తాగడం వల్లే ప్రజలు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 

నీటి కాలుష్యం లేదు : ఆళ్ల నాని

విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు. అస్వస్థతకు గత కారణాలపై ఆరాతీశారు. అయితే నగరంలో నీటి సరఫరాలో ఎలాంటి కాలుష్యం లేదని ఆళ్ల నాని తెలిపారు. బాధితుల శాంపిల్స్ తీసుకొని రాష్ట్ర స్థాయి ల్యాబ్ లో అన్ని పరీక్షలు చేస్తున్నామన్నారు. బాధితులకు చేసిన రక్త పరీక్షల్లో ఎలాంటి ఎఫెక్ట్ లేదని, నార్మల్ గా ఉందని అన్నారు. ఇంకా కల్చర్ సెల్స్ సెన్సిటివిటీ టెస్ట్ రిపోర్ట్ వస్తేనే క్షణ్ణంగా రిపోర్ట్ తెలుస్తుందన్నారు. 

బాధితులందరికీ కోవిడ్ టెస్ట్ కూడా చేశామని, అందరికీ నెగిటివ్ వచ్చిందని అన్నారు. లక్షణాలు ఉన్న వారే కాకుండా ఆందోళనకు గురై నీరసిస్తూ ఆస్పత్రులకు వస్తున్నారన్నారు. ఎవరూ అధైర్యపడవద్దని, మెరుగైన వైద్యం అందుబాటులో ఉందని ఆళ్ల నాని భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకు 70 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారున్నారు. ఇంకా 76 మంది మహిళలు, 46 మంది చిన్నపిల్లలు మొత్తం 157 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. మధ్య వయస్కులు క్షేమంగా ఉన్నారని, పిల్లలు, వృద్ధులు కాస్త ఇబ్బంది పడుతున్నారని ఆళ్ల నాని వెల్లడించారు.    

 

Leave a Comment